Bigg Boss Elimination: బిగ్ షాకింగ్.. ఒక్కసారిగా మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఆమెకు బదులు అతడు అవుట్-bigg boss telugu 8 this week elimination aditya om in bigg boss 8 telugu fifth week and mid week elimination highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: బిగ్ షాకింగ్.. ఒక్కసారిగా మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఆమెకు బదులు అతడు అవుట్

Bigg Boss Elimination: బిగ్ షాకింగ్.. ఒక్కసారిగా మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఆమెకు బదులు అతడు అవుట్

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu 8 Mid Week Elimination Fifth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఎలిమినేషన్‌లో బిగ్ షాకింగ్ న్యూస్ చోటు చేసుకుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఒక్కసారిగా ఎలిమినేట్ కంటెస్టెంట్ మారిపోయారు. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో నైనికకు బదులు అతను ఎలిమినేట్ అయి హౌజ్‌ నుంచి అవుట్ అయిపోయాడు.

బిగ్ షాకింగ్.. ఒక్కసారిగా మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఆమెకు బదులు అతడు అవుట్

Bigg Boss 8 Telugu Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ అనుకోని మలుపులు, ఊహించని ట్విస్టులతో సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బిగ్ బాస్ 8 తెలుగు మిడ్ వీక్ ఎలిమినేషన్ పూర్తి వివరాల్లోకి వెళితే..

నామినేషన్స్‌లో ఆరుగురు

బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం సాధారణ ఎలిమినేషన్‌తోపాటు మిడ్ వీక్‌లో కూడా ఎవిక్షన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ఆదివారం (సెప్టెంబర్ 29) ఎపిసోడ్‌లో చెప్పిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 30) నామినేషన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం నామినేషన్స్‌కు ఆరుగురు నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్

బిగ్ బాస్ 8 తెలుగు ఐదో వారం నామినేషన్స్‌లో నైనిక, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య ఓం, నిఖిల్ ఆరుగురు ఉన్నారు. వీరిలో ఈ వారం మిడ్ వీక్‌లో ఒకరు, వీకెండ్‌లో మరొకరు ఎలిమినేట్ కానున్నారనే సమాచారం జోరుగా వ్యాపించిన విషయం తెలిసిందే. వీరిలో నబీల్ బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్‌లో దూసుకుపోయాడు. ఆ తర్వాతి రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడు.

చివరిగా ఇద్దరు

అయితే, నబీల్, నిఖిల్ ఓటింగ్ స్థానాలు కాస్తా అటు ఇటుగా ఉన్నాయిని అధికారిక ఓటింగ్ పోల్స్ నుంచి వచ్చిన సమాచారం. ఇక మూడో ప్లేసులో మాత్రం నాగ మణికంఠ జోరు కొనసాగించాడు. ఆ తర్వాతి నాలుగో స్థానంలో యాంకర్ విష్ణుప్రియ కొనసాగింది. చివరి రెండు స్థానాలు అయిన ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా ఆదిత్య ఓం, నైనిక నిలిచారు.

డేంజర్ జోన్‌లో

అంటే, వీరిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు మిడ్ వీక్‌లో, మరొకరు వీకెండ్ ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అవుతారని సమాచారం వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మిడ్ వీక్‌లో నైనిక వెళ్తుందని, వీకెండ్ ఎవిక్షన్‌లో ఆదిత్య ఎలిమినేట్ కానున్నారని న్యూస్ తెగ వైరల్ అయింది. కానీ, ఇక్కడ ఊహించని ట్విస్ట్ జరిగి వీరి అభిమానులకు బిగ్ షాక్ తగిలింది.

మిడ్ వీక్ ఎలిమినేషన్ పూర్తి

ఈ ఇద్దరిలో బిగ్ బాస్ తెలుగు 8 ఐదోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన షూటింగ్ బుధవారం (అక్టోబర్ 2) జరిగింది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళ్టీ (అక్టోబర్ 3) ఎపిసోడ్‌లో చూపించనున్నారు. అయితే, అతి తక్కువ ఓటింగ్‌తో నైనిక, ఆదిత్య స్థానాలు కాస్తా అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది.

హౌజ్ నుంచి అవుట్

అందుకే, నైనిక కంటే తక్కవ ఓట్లు పడటంతోనే ఆమెకు బదులు ఆదిత్య ఓం మధ్యలోనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా, ఆదిత్యం ఓం లాహిరి లాహిరి సినిమాతో తెలుగు వారికి బాగా పరిచయం. ఆ తర్వాత ఇటీవల మరోసారి సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ద్వారా కాస్తా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.