Bigg Boss Telugu 8 Promo: టూత్ పేస్ట్‌కు బదులు ఫేస్ క్రీమ్ వాడిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆ ముగ్గురి మధ్య పోటీ!-bigg boss telugu 8 day 4 promo who will be the powerful chief contestant prithviraj use face cream instead of toothpaste ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Promo: టూత్ పేస్ట్‌కు బదులు ఫేస్ క్రీమ్ వాడిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆ ముగ్గురి మధ్య పోటీ!

Bigg Boss Telugu 8 Promo: టూత్ పేస్ట్‌కు బదులు ఫేస్ క్రీమ్ వాడిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆ ముగ్గురి మధ్య పోటీ!

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2024 02:29 PM IST

Bigg Boss 8 Telugu Day 4 Promo: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్‌కు కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాష్ రూమ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ బ్రష్ వేసుకోడానికి టూత్ పేస్ట్‌కు బదులు పేస్ క్రీమ్ పెట్టుకున్నాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు. ఇలా బిగ్ బాస్ తెలుగు 8 డే 4 ఎపిసోడ్ ప్రోమో చూస్తే..

టూత్ పేస్ట్‌కు బదులు ఫేస్ క్రీమ్ పెట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆ ముగ్గురి మధ్య పోటీ! (ప్రోమో)
టూత్ పేస్ట్‌కు బదులు ఫేస్ క్రీమ్ పెట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆ ముగ్గురి మధ్య పోటీ! (ప్రోమో) (Youtube @Disney Plus Hotstar )

Bigg Boss Telugu 8 Day 4 Promo: బిగ్ బాస్ తెలుగు 8 డే 4 ఎపిసోడ్ ప్రోమో సరదాగా, ఇంటెన్సివ్‌గా సాగింది. కంటెస్టెంట్స్ అందరూ వాష్‌రూమ్‌లో ఫ్రెష్ అవుతున్నారు. అదే సమయంలో సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ బ్రష్ వేసుకోడానికి తన బ్రష్‌పై ఒక క్రీమ్ పెట్టుకున్నాడు. పక్కనే కూర్చున్న నిఖిల్ అది గమనించాడు.

అవాక్కయిన కంటెస్టెంట్

అది వేసుకున్నావా నువ్వు అని నిఖిల్ అడిగాడు. దానికి పృథ్వీరాజ్ అవును అని సమాధానం ఇచ్చాడు. దాంతో అది ఫేస్ వాష్ అని నిఖిల్ చెప్పాడు. దాంతో పృథ్వీరాజ్ అవాక్కయ్యాడు. మిగతా కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా నవ్వారు. ఎవర్రా మీరు అని నిఖిల్ అంటే.. రెండు, మూడు రోజుల నుంచి అలాగే వేసుకుంటున్నావా అని యశ్మీ గౌడ అని అడిగింది.

దాంతో అక్కడి నుంచి సిగ్గుతో వెళ్లిపోయాడు పృథ్వీరాజ్. తర్వాత హాల్లో హౌజ్ మేట్స్ అందరినీ కూర్చుంచారు. సైన్యం లేని రాజు.. రాజు కాడు.. అలానే, చీఫ్ పవర్‌ఫుల్ కావడానికి వారికి క్లాన్ కావాలి. చీఫ్స్ వారి క్లాన్‌ను నిర్మించుకునే సమయం ఆసన్నమైంది అని బిగ్ బాస్ తెలిపాడు. దాంతో చీఫ్స్‌గా ఉన్న యశ్మీ గౌడ, నైనిక, నిఖిల్ తమకోసం పని చేసే క్లాన్స్ కోసం పోటీ పడ్డారు.

డిఫెండ్ చేసుకోవాలి

నా క్లాన్ ఎలాగైన గెలవాలి అని నాగ మణికంఠతో యశ్మీ గౌడ అంది. అంటే, మనం తప్పు చేసిన అక్కడ డిఫెండ్ చేసుకోవాలి. తర్వాత మనం కొట్టుకోవాలి అని విష్ణుప్రియతో నిఖిల్ అన్నాడు. అనంతరం నాగ మణికంఠను తనవైపు వచ్చేందుకు నైనిక మాట్లాడింది. మీకు ట్రిగర్ అయితే మాట్లాడండి అని సపోర్ట్ చేసింది.

నా క్లాన్‌గా నాకు తను చాలా నెససరీ అని అనిపించిందని విష్ణుప్రియ గురించి యశ్మీ చెప్పినట్లు చూపించారు. నాకు స్ట్రెంత్ దొరికింది, మైండ్ దొరికింది.. నేను ఎంటర్టైన్‌మెంట్ కాబట్టి.. ఐ వాంట్ మై ఎంటర్టైన్‌మెంట్ అని నైనిక చెప్పింది. నన్ను స్ట్రెచ్ చేసుకోడానికే వచ్చాను కాబట్టే తనను నేను సెలెక్ట్ చేసుకున్నాను అని అభయ్ నవీన్ తెలిపాడు.

మనుషులను గెలుచుకుంటున్నాడా లేదా అనేది చూడాలి. ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనా పాజిబుల్ అవుతుందని సోనియా ఆకుల చెప్పింది. ఇలా బిగ్ బాస్ సెప్టెంబర్ 5వ తేది ప్రోమోను ఇంటెన్సివ్‌గా చూపించారు. పవర్ ఫుల్ చీఫ్ పోటీ నిర్వహించి.. కంటెస్టెంట్‌ తమవైపు వచ్చేలా చీఫ్స్‌కు పోటీ ఇచ్చాడు బిగ్ బాస్.

ఎవరి క్లాన్స్ ఎవరంటే..

ఈ టాస్క్‌లో నిఖిల్ క్లాన్స్‌గా బెజవాడ బేబక్క, సోనియా ఆకుల, నాగ మణికంఠ, నైనికకు క్లాన్స్‌గా ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నబీల్ అఫ్రీది, విష్ణుప్రియ ఉండగా.. యశ్మీ గౌడకు పృథ్వీరాజ్, శేఖర్ బాషా, ప్రేరణ, అభయ్ నవీన్ క్లాన్స్‌గా ఉన్నట్లు సమాచారం. ఇలా ముగ్గురు చీఫ్స్ మధ్య పోటీ పెట్టాడు బిగ్ బాస్.