Spy Teaser Launch Date: నిఖిల్ స్పై టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - హిస్టారికల్ ప్లేస్‌లో ఈవెంట్
Spy Teaser Launch Date: నిఖిల్ స్పై మూవీ టీజర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌ను చారిత్రక ప్రదేశంలో నిర్వహించబోతున్నారు. ఆ ప్లేస్ ఏదంటే...

Spy Teaser Launch Date: నిఖిల్ స్పై మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. చారిత్రక ప్రదేశంలో టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. మే 15న న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ (కర్తవ్య పథ్) లో టీజర్‌ను లాంఛ్ చేయబోతున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ జీవితం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఆయన విగ్రహం వద్దే నిర్వహించబోతున్నారు. టీజర్ లాంఛ్ డేట్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
రాజ్‌ఫథ్ వద్ద టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను జరుపుకోబోతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం గమనార్హం. నిఖిల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాతో ఎడిటర్ గ్యారీ బీ హెచ్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించి వెలుగులోకి రాని నిజాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఈ స్పై సినిమాను తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమటం కీలక పాత్రలను పోషిస్తోన్నారు. వరల్డ్ వైడ్‌గా జూన్ 29న స్పై మూవీ రిలీజ్ కానుంది. ఈస్పై సినిమాకు కే రాజశేఖర్ రెడ్డి కథను అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తోన్నారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తోన్నారు.
కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్‌లో పెద్ద విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కార్తికేయ 2 మూవీ 130 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సక్సెస్ తర్వాత వస్తోన్న స్పై మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
టాపిక్