Bigg Boss Elimination: ఈ వారం ఎలిమినేషన్ రెండు సార్లు.. ఎవిక్షన్ తేదిల్లో మార్పులు.. ఏ రోజు ఎవరు ఎలిమినేట్ కానున్నారంటే?
Bigg Boss Telugu 8 Elimination Fifth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లనున్నారు. అయితే, ఎప్పుడు అయ్యే ఎలిమినేషన్ సండే రోజు కాకుండా కాస్తా ముందుగానే చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bigg Boss 8 Telugu Elimination This Week Double: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఐదు వారాలకు చేరుకుంది. సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగులోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. వారిలో ఇప్పటికీ వరుసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఒక్కో వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.
నామినేషన్స్‌లో ఆరుగురు
నలుగురు హౌజ్‌మేట్స్ వెళ్లిపోవడంతో ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరికి సోమవారం (సెప్టెంబర్ 30) ఐదోవారం నామినేషన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, నైనిక, నాగ మణికంఠ, నబీల్, ఆదిత్య ఓం, నిఖిల్ ఆరుగురు ఉన్నారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్
అయితే, సోనియా ఎలిమినేట్ అయిన ఆదివారం (సెప్టెంబర్ 29) ఎపిసోడ్‌లో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని హోస్ట్ నాగార్జున తెలిపారు. అంటే, మధ్యలో ఓ ఎలిమినేషన్‌తోపాటు వీకెండ్ కూడా మరో ఎలిమినేషన్ ఉండనుంది. దీంతో ఈ వారం రెండుసార్లు ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది.
గురువారం ఎలిమినేషన్
మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్‌ను గురువారం (అక్టోబర్ 3) ప్రకటిస్తారు. అయితే, ఐదోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ మాత్రం బుధవారం (అక్టోబర్ 2) నాడే జరుగుతుంది. ఇక ప్రతివారం చేసే ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం ఉంటుందని తెలిసిందే. కానీ, ఈవారం మాత్రం ఆదివారం కంటే ఒకరోజు ముందుగా శనివారం (అక్టోబర్ 5) ఎవిక్షన్ అయిన కంటెస్టెంట్‌ను నాగార్జున చెప్పనున్నారు.
మరికొంతమంది కంటెస్టెంట్స్
ఎందుకంటే, ఆదివారం (అక్టోబర్ 6) నాడు బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 జరగనుంది. దీంతో హౌజ్‌లోకి సరికొత్తగా ఆరుగురు లేదా, ఏడుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ లాంచ్ తరహాలోనే ఈ 2.0 లాంచ్‌ను చేయనున్నారు. ఈ లాంచ్ కంటే ముందే హౌజ్‌లో 10 మంది నుంచి ఇద్దరిని ఈ వారం ఎలిమినేట్ చేసి 8 మందిని ఉంచనున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0
ముందు ఈ 2.0 లాంచ్ అక్టోబర్ 5నే జరగనుందని టాక్ వచ్చింది. కానీ, తాజాగా వచ్చిన బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం గ్రాండ్ లాంచ్ 2.0 అక్టోబర్ 6న నిర్వహించనున్నారు. ఇలా ఎవిక్షన్ తేదీల్లో మార్పులు చేశారు. ఇక ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో అందరికంటే తక్కువ ఓటింగ్ తెచ్చుకుంటోన్న నైనిక ఎలిమినేట్ అవనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ట్విస్ట్ కూడా?
అలాగే, ఎప్పుడూ జరిగే వీకెండ్ ఎలిమినేషన్‌లో నైనిక కంటే మెరుగ్గా.. మిగతా కంటెస్టెంట్స్ కంటే తక్కువ ఓటింగ్‌లో ఉన్న ఆదిత్య ఓం ఎలిమినేట్ కానున్నారని సమాచారం. అయితే, ఎవిక్షన్ తేది వరకు ఎవరు ఎలిమినేట్ కానున్నరనే సస్పెన్స్ ఉత్కంఠత పెంచుతోంది. ఈ ఇద్దరే ఎలిమినేట్ కావచ్చు. లేదా బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేషన్ మార్చే అవకాశం కూడా లేకపోలేదు.