Ravikrishna: సినిమాల్లో ఛాన్సుల‌ కోస‌మే బిగ్‌బాస్ చేశా - విరూపాక్ష ఫేమ్‌ ర‌వికృష్ణ కామెంట్స్‌!-bigg boss ravikrishna interview about the birth day boy telugu movie tollywood virupaksha actor telugu serials ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravikrishna: సినిమాల్లో ఛాన్సుల‌ కోస‌మే బిగ్‌బాస్ చేశా - విరూపాక్ష ఫేమ్‌ ర‌వికృష్ణ కామెంట్స్‌!

Ravikrishna: సినిమాల్లో ఛాన్సుల‌ కోస‌మే బిగ్‌బాస్ చేశా - విరూపాక్ష ఫేమ్‌ ర‌వికృష్ణ కామెంట్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jul 14, 2024 05:42 PM IST

Ravikrishna: సినిమాల్లో ఆఫ‌ర్స్ కోస‌మే బిగ్‌బాస్‌తో పాటు సీరియ‌ల్స్ చేశాన‌ని ర‌వికృష్ణ అన్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సాయిధ‌ర‌మ్‌తేజ్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేస్తున్న‌ట్లు తెలిపాడు. ర‌వికృష్ణ లీడ్ రోల్‌లో న‌టించిన ది బ‌ర్త్ డే బాయ్ మూవీ జూలై 19న రిలీజ్ కాబోతోంది.

ర‌వికృష్ణ‌
ర‌వికృష్ణ‌

Ravikrishna: విరూపాక్షలో నెగెటివ్ షేడ్స్‌లో క‌నిపించి మెప్పించారు ర‌వికృష్ణ‌. సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ర‌వికృష్ణ ప్ర‌స్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ర‌వికృష్ణ లీడ్ రోల్‌లో న‌టించిన ది బ‌ర్త్ డే బాయ్ సినిమా జూలై 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలోస‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్నారు. ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు.ది బ‌ర్త్ డే బాయ్‌ గురించి ర‌వికృష్ణ చెప్పిన సంగ‌తులివి...

విరూపాక్ష టైమ్‌లోనే...

విరూపాక్ష సినిమాలో న‌టిసోన్న‌ప్పుడే ది బ‌ర్త్ డే బాయ్ ఆఫర్‌ వచ్చింది. రియల్ ఇన్సిడెంట్‌తో రూపొందే కథలంటే నాకు చాలా ఇష్టం. కథ విన‌గానే చాలా న‌చ్చింది. వెంటనే ఓకే చెప్పాను. అడిషన్‌ ద్వారా దిబర్త్‌డే బాయ్‌ సినిమలో నన్ను సెలెక్ట్‌ చేసుకున్నారు. ఐదుగురు స్నేహితుల చుట్టూ ఈ క‌థ సాగుతుంది.

బర్త్‌డే బంప్స్‌ వాళ్ల అందులో ఓ స్నేహితుడు చనిపోతాడు. ఆ సిట్యుయేషన్ నుంచి మిగిలిన న‌లుగురు ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఎలాంటి ప్లాన్స్ వేశారు? అన్న‌ది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా వుంటుంది.

ఫుల్ లెంగ్త్ రోల్‌...

ఐదుగురు స్నేహితుల్లో ఒకతనికి బ్ర‌ద‌ర్‌గా నా క్యారెక్ట‌ర్ సినిమాలో క‌నిపిస్తుంది. ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశా. ఇది కల్పిత కథ కాదు. కంప్లీట్ రియల్ ఇన్సిడెంట్‌తో ద‌ర్శ‌కుడు విస్కి ది బ‌ర్త్ డే బాయ్ మూవీని తెర‌కెక్కించారు. . ట్రూ ఎమోషన్స్‌, డ్రామాతో ప్రారంభం నుంచి ముగింపు వరకు చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. ఆడియెన్స్‌లో ఉత్కంఠ‌ను క‌లిగించ‌డం కోసం క థ‌లో కొంత ఫిక్షన్‌ డ్రామాను దర్శకుడు కలిపాడు. 48 గంటల్లో ఈ మూవీ క‌థ మొత్తం జ‌రుగుతుంది. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే, ఉత్కంఠపంచుతుంది.

అందుకే బిగ్‌బాస్ చేశా....

సినిమాల్లో న‌టించ‌డ‌మే నా గోల్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఓ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టా. ఇండ‌స్ట్రీలో తెలిసిన వాళ్లు ఎవ‌రూలేక‌పోవ‌డంలో వ‌చ్చిన అన్ని ఆఫ‌ర్స్ చేసుకుంటూ వెళ్లిపోయా. సినిమాల్లో అవ‌కాశాల కోస‌మే బిగ్‌బాస్‌, సీరియ‌ల్స్ లో క‌నిపించాడు. బిగ్‌బాస్‌ తరువాత సినిమాలపై దృష్టి పెట్టాను.

వంద కోట్ల సినిమాలో…

విరూపాక్ష సినిమాలో నా క్యారెక్ట‌ర్‌కు మంచి పేరు వస్తుందని అనుకోలేదు. 100 కోట్ల సినిమాలో నేను ఓ ముఖ్యపాత్రను చేయడం లక్కీగా భావిస్తాను.

ఒక్కో మెట్టు ఎక్కుతోన్నా....

సినిమా అంటే నాకు పిచ్చి, కాబట్టే చావైనా, బ్రతుకైనా ఇక్కడే కాబట్టి అవకాశాల కోసం వెయిట్‌ చేస్తాను. విరూపాక్షతో నటుడిగా ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. ఇలాగే నెమ్మదిగా మంచి పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు పొందాలి. నటుడిగా నేను నేర్చుకోవాల్సివుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ...

ది బ‌ర్త్ డే బాయ్ త‌ర్వాత 1 ఏ2 ఏ3 అనే సినిమాలో హీరోగా చేస్తున్నాను. విజయ్‌ దేవరకొండ సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాను. సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాలో నా క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంటుంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి.

విరూపాక్ష‌తో పాటు రీసెంట్‌గా ల‌వ్ మీ, ఆ ఒక్క‌టి అడ‌క్కు తో పాలు ప‌లు సినిమాలు చేశాడు. మన‌సు మ‌మ‌త‌, ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి, శ్రీనివాస క‌ళ్యాణంతో పాటు తెలుగులో ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించాడు. బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.

Whats_app_banner