Bangalore Rave Party: బ‌ర్త్ డే పార్టీ అంటే వెళ్లా - రేవ్ పార్టీ అని తెలియ‌దు - డ్ర‌గ్స్ కేసుపై ఆషీరాయ్ కామెంట్స్‌-tollywood heroine aashi roy reacted on attending bangalore rave party ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bangalore Rave Party: బ‌ర్త్ డే పార్టీ అంటే వెళ్లా - రేవ్ పార్టీ అని తెలియ‌దు - డ్ర‌గ్స్ కేసుపై ఆషీరాయ్ కామెంట్స్‌

Bangalore Rave Party: బ‌ర్త్ డే పార్టీ అంటే వెళ్లా - రేవ్ పార్టీ అని తెలియ‌దు - డ్ర‌గ్స్ కేసుపై ఆషీరాయ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 24, 2024 12:17 PM IST

Bangalore Rave Party: బెంగ‌ళూరు రేవ్ పార్టీలో తెలుగు హీరోయిన్ ఆషీరాయ్ కూడా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై ఆషీరాయ్ స్పందించింది. అది రేవ్ పార్టీ అని త‌న‌కు తెలియ‌ద‌ని అన్న‌ది.

ఆషీరాయ్
ఆషీరాయ్

Bangalore Rave Party: బెంగ‌ళూరు రేవ్ పార్టీ లో డ్ర‌గ్స్ తీసుకుంటూ ప‌లువురు టాలీవుడ్ న‌టున‌టులు పోలీసులుకు ప‌ట్టుబ‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డ్ర‌గ్స్ కేసు అన‌గానే టాలీవుడ్‌తో లింకులు ఉండ‌టం చాలా కాలంగా కామ‌న్‌గా మారిపోయింది. మ‌రోసారి డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ న‌టులు రెడ్ హ్యాండెడ్‌గా దొర‌క‌డంతో ఇండ‌స్ట్రీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్నాయి.

ఈ రేవ్ పార్టీలో హేమ‌తో పాటు మ‌రికొంద‌రు న‌టీన‌టులు ఉన్నారు. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డిన వాళ్ల‌కు నార్కోటిక్స్ టీమ్ డ్ర‌గ్స్ టెస్ట్ చేయగా అందులో 86 మంది పాజిటివ్‌గా తేలిన‌ట్లు స‌మాచారం. పాజిటివ్‌గా తేలిన వారిలో హేమ ఉంది. ఆమె బ్ల‌డ్ శాంపిల్స్‌లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు ఉన్న‌ట్లు టెస్ట్ రిపోర్ట్‌లో తేలింది.

ఆషీరాయ్ కూడా...

కాగా రేవ్ పార్టీకి టాలీవుడ్ హీరోయిన్ ఆషీరాయ్ అటెండ్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె బ్ల‌డ్ శాంపిల్స్ కూడా పోలీసులు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ రేవ్ పార్టీపై ఆషీరాయ్ సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

అది బ‌ర్త్‌డే పార్టీ...

బ‌ర్త్‌డే పార్టీ అని ఇన్వైట్ చేస్తే బెంగ‌ళూరు వెళ్లాన‌ని, అది రేవ్ పార్టీ అనే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని ఆషీరాయ్ అన్న‌ది. పార్టీలోప‌ల అంద‌రూ ఏం చేస్తున్నారో...అక్క‌డ ఏం జ‌రుగుతుందో త‌న‌కు తెలియ‌ద‌ని అన్న‌ది. ఆడ‌పిల్ల‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి క‌ష్ట‌ప‌డి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాన‌ని, రేవ్ పార్టీ వివాదంలోకి త‌న‌ను లాగొద్ద‌ని ఆషీరాయ్ అన్న‌ది.

ఈ పార్టీకి ఎవ‌రెవ‌రూ అటెండ్ అయ్యింది కూడా త‌న‌కు తెలియ‌ద‌ని అన్న‌ది. క‌ష్ట‌కాలంలో త‌న‌కు అంద‌రూ స‌పోర్ట్‌గా నిల‌వాల‌ని కోరింది. రేవ్ పార్టీపై ఆమె చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. ఆషీరాయ్ తెలుగులో కేఎస్ 100, మిస్ట‌రీ ఆఫ్ సారిక‌తో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలు చేస్తోంది.

వీడియోతో త‌ప్పుదారి...

ఈ రేవ్ పార్టీలో న‌టి హేమ కూడా పోలీసుల‌కు దొరికింది. కానీ తాను రేవ్ పార్టీకి వెళ్ల‌లేద‌ని, హైద‌రాబాద్‌లోనే ఉన్నానంటూ హేమ ఓ వీడియోను విడుద‌ల‌చేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న‌ట్లు క‌ర్ణాట‌క పోలీసులు ధృవీక‌రించారు. తొలుత ఆమె పేరును కృష్ణ‌వేణిగా న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం.రేవ్ పార్టీ తాలూకు వీడియోలు, ఫోటోలు వైర‌ల్ కావ‌డంతో ఆమెను హేమ‌గా గుర్తించిన‌ట్లు తెలిసింది.

శ్రీకాంత్ శ్యామ‌ల పేర్లు కూడా...

తాజాగా నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్‌గా రావ‌డంతో ఆమె బెంగ‌ళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే కౌన్సిలింగ్‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులో పేర్కొన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బ్ల‌డ్ శాంపిల్స్ లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు ఉండ‌టంపై హేమ స్పందించింది.

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఈ వివాదంపై మాట్లాడుతాన‌ని అన్న‌ది. అప్ప‌టివ‌ర‌కు ఏం చేస్తారో చేసుకొండి అంటూ పేర్కొన్న‌ది. అంత‌కుమించి ఈ డ్ర‌గ్స్ కేసుపై మాట్లాడ‌టానికి హేమ నిరాక‌రించింది.ఈ రేవ్ పార్టీలో హేమ‌తో పాటు శ్రీకాంత్‌, యాంక‌ర్ శ్యామ‌ల కూడా పాల్గొన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ పుకార్ల‌ను ఇద్ద‌రు ఖండించారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్