Bigg Boss 7 No Elimination : ఈ వారం నో ఎలిమినేషన్.. ప్రశాంత్ సరిగా మాట్లాడట్లేదని శివాజీ హర్ట్-bigg boss 7 telugu updates no elimination in this week and contestants will play for eviction pass again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 No Elimination : ఈ వారం నో ఎలిమినేషన్.. ప్రశాంత్ సరిగా మాట్లాడట్లేదని శివాజీ హర్ట్

Bigg Boss 7 No Elimination : ఈ వారం నో ఎలిమినేషన్.. ప్రశాంత్ సరిగా మాట్లాడట్లేదని శివాజీ హర్ట్

Anand Sai HT Telugu
Nov 20, 2023 07:29 AM IST

Bigg Boss 7 Telugu : ఈ వారం బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. కానీ ఎలిమినేషన్ లేదంటూ చెప్పాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ 7 తెలుగు
బిగ్ బాస్ 7 తెలుగు

Bigg Boss 7 Telugu Updates : బిగ్ బాస్(Bigg Boss) హౌస్‍లో యావర్ కారణంగా ఇతర కంటెస్టెంట్లకు మంచి జరిగింది. గతవారం ఎవిక్షన్ పాస్ యావర్(Yawar) గెలుచుకున్నాడు. అయితే వీకెండ్ ఎపిసోడ్లో ఆటలో యావర్ చేసిన ఫౌల్స్ చూపించారు. దీంతో యావర్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. తనకు ఎవిక్షన్ పాస్(Eviction Pass) వద్దని చెప్పాడు. తన క్యారెక్టర్ ముఖ్యమని తెలిపాడు. స్వచ్ఛందంగా పాస్ తిరిగి ఇచ్చేశాడు. అయితే ఇదే నామినేషన్స్ లో ఉన్నవారికి మంచి చేసింది.

వీకెండ్ ఎపిసోడ్లో నామినేషన్స్ లో ఉన్న వారిని సేవ్ చేస్తూ వచ్చారు బిగ్ బాస్. చివరగా అశ్వినీ, గౌతమ్ మిగిలారు. వారి ముందు ఒక బాక్స్ పెట్టి.. అందులో చేతులు పెట్టమన్నారు నాగార్జున(Nagarjuna). ఎవరి చేతులకు రెడ్ కలర్ రంగు అంటుకుంటుందో వారు అన్ సేఫ్ అని చెప్పారు. అయితే ఇద్దరికీ గ్రీన్ కలర్ అంటుకుంది. దీంతో ఇద్దరూ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు. యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసినందుకు బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. అయితే వచ్చేవారం ఎవిక్షన్ పాస్ కోసం మళ్లీ పోటీ ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. డబుల్ ఎలిమినేషన్(Double Elimination) ఉంటుందని కూడా నాగార్జున తెలిపారు.

ఇక అంతకుముందు ఆదివారం ఎపిసోడ్ కావడంతో సరదా సరదా జరిగింది. ఫ్రెండ్, బ్లాక్ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రతిక, అశ్వినీ కాస్త స్ట్రాటజీలు ప్లే చేసినట్టుగా కనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా శోభా శెట్టి(Shobha Shetty)పై ఫైర్ అయ్యే ఈ ఇద్దరూ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు. శోభాను చాలా మంది ఫ్రెండ్ అంటూ చెప్పారు. మెుదట్లో తాము క్లోజ్ గా ఉండేవాళ్లమని, బయటకు వెళ్లి వచ్చాక.. మనస్ఫర్థాలు వచ్చాయని, కానీ మళ్లీ క్లోజ్ గా ఉంటున్నామని రతిక చెప్పింది. యావర్ కూడా శోభాకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ కు కూడా ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ ఎక్కువే వచ్చాయి. శోభా కూడా రతికకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ పెట్టింది. ప్రశాంత్‍కు గౌతమ్, అమర్, ప్రియాంక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ పెట్టారు.

ఈ టాస్కులో ఎక్కువగా శోభా, ప్రశాంత్ కు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ వచ్చింది. అయితే శోభాకు ఒక బ్లాక్ రావడంతో హౌస్‍లో కొత్తగా యాడ్ అయిన ఫ్రెండ్ ప్రశాంత్ అని ప్రకటించారు నాగార్జున. ఇక ఎక్కువ బ్లాక్ స్టాంపులు గౌతమ్ కు వచ్చాయి. శోభా, అశ్వినీ, ప్రశాంత్ వచ్చి.. గౌతమ్‍కు బ్లాక్ స్టాంప్ వేశారు. గతవారం అమర్‍దీప్‍ను టార్గెట్ చేసి.. బాల్స్ వేశాడని చెప్పుకొచ్చారు. రతికకు కూడా స్టౌంపులు ఎక్కువే పడ్డాయి. శివాజీ, అమర్, ప్రశాంత్ ఆమెకు బ్లాక్ స్టౌంపులు వేశారు. బిడ్డగా ఓకేగానీ, ఫ్రెండ్‍గా కాదని శివాజీ కామెంట్స్ చేశాడు.

అంతకుముందు ఎపిసోడ్ మెుదలు కాగానే.. యావర్ దగ్గరకు వచ్చి.. శోభా శెట్టి మెచ్చుకుంది. ఎవిక్షన్ పాస్ విషయంలో మంచి డెసిషన్ తీసుకున్నావని తెలిపింది. ఐ లక్ యూ యావర్ అంటూ చెప్పింది. ప్రియాంక కూడా యావర్ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే క్లోజ్‍గా ఉండే రతికా మాత్రం యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడంపై హర్ట్ అయింది. యావర్ ది సేఫ్ గేమ్ అంటూ కామెంట్స్ చేసింది. ఎవిక్షన్ పాస్ తన కోసం ఉపయోగించాల్సి వస్తుందేమోనని తిరిగి ఇచ్చేశావంటూ ఆరోపణలు చేసింది. బర్గర్ టాస్క్, స్కూటర్ నెంబర్ ప్లేట్స్ టాస్కులో ఎలా ఆడాడో గుర్తుకు చేసింది. మళ్లీ ఆడి గెలుస్తానని శపథం చేశాడు యావర్.

మెుత్తానికి బిగ్ బాస్ హౌస్‍లో మాత్రం కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు కంటెస్టెంట్స్. రతికా సీరియల్ బ్యాచ్‍కు దగ్గరయ్యేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే యావర్ వెనకాల నుంచి గొయ్యి తవ్వుతున్నట్టుగా కనిపిస్తుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ప్రశాంత్‍కు ఎక్కువ ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు వచ్చిన సమయంలో శివాజీ కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ తన దగ్గరకు రావట్లేదని అన్నాడు. సంచాలకుడిగా ఉన్నప్పుడు సీరియస్ అయితే హర్ట్ అయ్యాడని నాగార్జున చెప్పుకొచ్చారు.