Bigg Boss: బిగ్ బాస్‌లో లేడి కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ కోసం ఎదురుచూపులు-bigg boss 17 ankita lokhande confirms her pregnancy test in house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss: బిగ్ బాస్‌లో లేడి కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ కోసం ఎదురుచూపులు

Bigg Boss: బిగ్ బాస్‌లో లేడి కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ కోసం ఎదురుచూపులు

Sanjiv Kumar HT Telugu
Nov 19, 2023 10:28 AM IST

Bigg Boss 17 Ankita Pregnancy Test: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. తాజాగా లేడి కంటెస్టెంట్ అంకితకు బిగ్ బాస్ నిర్వహాకులు ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారని సంచలన విషయాలు తెలియజేసింది.

బిగ్ బాస్‌లో ఆ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ కోసం ఎదురుచూపులు
బిగ్ బాస్‌లో ఆ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ కోసం ఎదురుచూపులు

Ankita Lokhande About Her Pregnancy Test: ఇండియాలో అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. అమెరికాలో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ ముందుగా హిందీలో వచ్చింది. అనంతరం తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లో పలు సీజన్లతో దూసుకుపోతోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంటే హిందీలో మాత్రం 17వ సీజన్ నడుస్తోంది. బిగ్ బాస్ 17 హిందీకి హోస్టుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు.

అయితే, బిగ్ బాస్ హిందీ 17లో మొదటి నుంచే హాట్ టాపిక్‌గా మారిన జంట అంకితా లోఖండే, విక్కీ జైన్. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ జంట బిగ్ బాస్ హిందీ సీజన్ 17లోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టారు. వీళ్లు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ జంట మధ్య గొడవలు, అలగడాలు స్టార్ట్ అయ్యాయి. దీన్ని అదునుగా తీసుకున్న హిందీ బిగ్ బాస్ వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేసేవాడు. ఇక భార్యాభర్తలు అన్నాకా గొడవ పడటం, సర్దుకుపోవడం మాములే.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హిందీ 17 సీజన్ కంటెస్టెంట్ అంకిత లోఖండే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌లో తనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని, నెలసరి కూడా రావడం లేదని భర్త విక్కీ జైన్‌తో చెప్పింది అంకింత లోఖండే. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. కానీ, ఈ కామెంట్స్ చేసి రెండు రోజులు గడుస్తున్న అంకిత ప్రెగ్నెన్సీ పరీక్ష గురించి ఎలాంటి సమాచారం లేదు.

అంకిత కామెంట్స్ హిందీ చిత్రసీమలో సంచలనంగా మారడంతో ఆ టాపిక్‌కు సంబంధించిన ఫుటేజ్‌ను టెలీకాస్ట్ చేయట్లేదేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒకవేళ అంకితకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే.. బిగ్ బాస్ హౌజ్‌లో మొదటిసారిగా తల్లిదండ్రులు కానున్నట్లు తెలుసుకున్న జంటగా అంకిత, విక్కీ జంట రికార్డుకెక్కుతుంది.

Whats_app_banner