Allu Arjun Atlee Movie: గురువు శంక‌ర్‌ను బీట్ చేసిన అట్లీ - అల్లు అర్జున్ మూవీ కోసం రికార్డ్ రెమ్యున‌రేష‌న్-atlee charging record remuneration for allu arjun pushpa 2 jawan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Atlee Movie: గురువు శంక‌ర్‌ను బీట్ చేసిన అట్లీ - అల్లు అర్జున్ మూవీ కోసం రికార్డ్ రెమ్యున‌రేష‌న్

Allu Arjun Atlee Movie: గురువు శంక‌ర్‌ను బీట్ చేసిన అట్లీ - అల్లు అర్జున్ మూవీ కోసం రికార్డ్ రెమ్యున‌రేష‌న్

Nelki Naresh Kumar HT Telugu
Mar 12, 2024 06:04 AM IST

Allu Arjun Atlee Movie: అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో ఓ స్టైలిష్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం అట్లీ 60 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసిన‌ట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి

అల్లు అర్జున్‌, అట్లీ
అల్లు అర్జున్‌, అట్లీ

Allu Arjun Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబో సెట్ అయిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మెసేజ్‌కు స్టైలిష్ యాక్ష‌న్ మాస్ అంశాల‌ను మేళ‌వించి సినిమాలు తెర‌కెక్కించ‌డం డైరెక్ట‌ర్ అట్లీ స్పెషాలిటీ.

తేరీ నుంచి జ‌వాన్ వ‌ర‌కు ఈ ఫార్ములాలో అట్లీ రూపొందించిన‌ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. షారుఖ్‌ఖాన్ హీరోగా గ‌త ఏడాది విడుద‌లైన జ‌వాన్ మూవీ 1100 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. బాలీవుడ్ హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

రికార్డ్ రెమ్యున‌రేష‌న్‌...

జ‌వాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ కోసం అట్లీ 60 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోనున్న‌ట్లు తెలిసింది. జ‌వాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అట్లీకి డిమాండ్ పెర‌గ‌డంతో అత‌డు కోరినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి ప్రొడ్యూస‌ర్లు అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మూవీతో కోలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్‌ను అందుకోనున్న‌ట్లు డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో అట్లీ చేర‌నున్నాడు.

గురువు రికార్డ్ బ్రేక్‌...

రెమ్యున‌రేష‌న్ల విష‌యంలో కోలీవుడ్‌లో శంక‌ర్ టాప్‌లో ఉన్నాడు. శంక‌ర్ ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. త‌న గురువు శంక‌ర్ రికార్డును అల్లు అర్జున్ మూవీతో అట్లీ తిర‌గ‌రాయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

త్రిష ఇంపార్టెంట్ రోల్‌...

అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెర‌కెక్క‌నున్న మూవీని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో త్రిష ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమెతో పాటు మ‌రో స్థార్ హీరోయిన్ లీడ్ రోల్ చేయ‌నున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే అల్లు అర్జున్‌, అట్లీ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

పుష్ప 2తో బిజీ...

ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్‌లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న ఈ సీక్వెల్ ఆగ‌స్ట్ 15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. పుష్ఫ పార్ట్ వ‌న్ దాదాపు 400 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. కొవిడ్ త‌ర్వాత ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా పుష్ప‌ నిలిచింది. ఇందులో పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానుల‌ను మెప్పించాయి.

పుష్ప సినిమాకుగాను బెస్ట్ యాక్ట‌ర్‌గా బ‌న్నీ నేష‌న‌ల్ అవార్డు అందుకున్నాడు. దాంతో పుష్ప సీక్వెల్‌పై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. పుష్ప 2 సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో సునీల్‌, అన‌సూయ కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు.

అట్లీ మూవీతో పాటు యానిమ‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ వంగాతో అల్లు అర్జున్ ఓ మూవీ క‌మిట‌య్యాడు. టీ సిరీస్ సంస్థ ఈ భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మించ‌నుంది.

WhatsApp channel