Kiara Advani: వామ్మో...డాన్ 3 కోసం కియారా అద్వానీ రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే!
Kiara Advani: బాలీవుడ్, టాలీవుడ్...ఇండస్ట్రీ ఏదైనా రెమ్యునరేషన్ల విషయంలో హీరోలదే అధిపత్యం కనిపిస్తుంది. కథానాయికలు పది కోట్లకు మించి రెమ్యునరేషన్ అందుకోవడం రికార్డ్‌గానే చెప్పుకుంటారు. డాన్ 3 మూవీతోతో ఈ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నది కియారా అద్వానీ.
(1 / 6)
డాన్ 3 కోసం కియారా అద్వానీ ఏకంగా పదమూడు కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కియారా కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని బాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
(2 / 6)
డాన్3లో తనది యాక్షన్ ప్రధానంగా సాగే రోల్ కావడంతో 13 కోట్ల రెమ్యునరేషన్‌ను కియారా డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలు కూడా ఆమె అడిగినంద మొత్తం ఇవ్వాలని ఫిక్సైనట్లు తెలిసింది.
(3 / 6)
డాన్ 3 మూవీలో రణ్‌వీర్‌సింగ్ హీరోగా నటిస్తోన్నాడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
(4 / 6)
తెలుగులో రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోంది కియారా అద్వానీ. వినయవిధేయరామ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ కలిసి రొమాన్స్ చేస్తోన్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
(5 / 6)
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2లో కియారా అద్వానీ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా కనిపించబోతున్నాడు.
ఇతర గ్యాలరీలు