
(1 / 5)
కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమా బేబీ జాన్. ఆమె తొలి హిందీ సినిమా ఇది. దీని కన్నా ముందు అజయ్ దేవగణ్ నటించిన మైదాన్ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నారు. మధ్య వయస్కురాలైన మహిళ పాత్ర కావడంతో కీర్తి సురేష్ నటించడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు మేకర్స్.

(2 / 5)
రానా దగ్గుబాటి తన సొంత నిర్మాణంలో తెలుగు, హిందీ ద్విభాషా చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాడని సమాచారం. ఇది కొరియన్ రీమేక్ సినిమా. అందులో కీర్తి సురేష్ ను నటించమని అడిగినా ఆమె నిరాకరించింది.

(3 / 5)
కీర్తి సురేష్ ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌లో రాధికా ఆప్టే కీలక పాత్రలో నటిస్తోంది.

(4 / 5)
రీటా, రఘు దాదాలతో కలిసి కీర్తి సురేష్ మరో చిత్రంలో నటిస్తోంది. ఈ మూడు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

(5 / 5)
కీర్తి సురేష్ అందంలో, అభినయంలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.
ఇతర గ్యాలరీలు