O2 Movie Review: ఓ2 రివ్యూ - నా సామిరంగ హీరోయిన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Ashika Ranganath o2 Movie Review: ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ ఓ2 ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Ashika Ranganath o2 Movie Review: నా సామిరంగ ఫేమ్ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన ఓ2 మూవీ కన్నడంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దివంగత కన్నడ అగ్ర నటుడు పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్విని ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రాఘవ్ నాయక్, ప్రశాంత్ రాజ్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ కన్నడ మూవీ ఎలా ఉందంటే?
డాక్టర్ ప్రయోగం...
శ్రద్ధానాయక్ (ఆషికా రంగనాథ్) ఓ డాక్టర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోతుంది. సిగరెట్ వ్యసనం కారణంగా తండ్రి హఠాత్తుగా కన్నుమూస్తాడు. తల్లిదండ్రుల దూరమైన బాధ శ్రద్ధాను అనుక్షణం వెంటాడుతుంది. కష్టపడి డాక్టర్ అయిన శ్రద్ధా మనిషికి మరణమే లేకుండా చేయాలనే ఆలోచనతో ఓ2 అనే డ్రగ్‌ను కనిపెడుతుంది. ఓ మనిషి చనిపోయిన అరగంట నుంచి గంటలోపు ఓ2 డ్రగ్ ఇస్తే తిరిగి గుండె మామూలుగా పనిచేసి అతడు బతకికే ఛాన్స్ ఉండేలా ఆ మెడిసిన్ తయారు చేస్తుంది.
ఓ2 హ్యుమన్ ట్రయల్స్ కోసం డాక్టర్ దేవ్ (ప్రవీణ్ తేజ్), శ్రుష్టి (అరుణ), వెంకీ(పునీత్)లతో ఓ టీమ్‌ను ఏర్పాటుచేసుకుంటుంది శ్రద్ధా. కానీ సీనియర్ డాక్టర్ మృత్యుంజయ్ (ప్రకాష్ బేలావాడీ) ఓ2 హ్యూమన్ ట్రయల్స్‌కు ఒప్పుకోడు. శ్రద్దా రీసెర్చ్‌ను బ్యాన్ చేయిస్తాడు. ఓంకార్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది. చావు బతుకుల మధ్య శ్రద్ధా పనిచేసే హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్ స్టాఫ్‌కు తెలియకుండా తాను కనిపెట్టిన ఓ2 డ్రగ్ అతడికి ఇస్తుంది శ్రద్ధా.
అదే సమయంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా శ్రద్ధా ల్యాబ్ కాలిపోతుంది. ఈ ప్రమాదంలో ఓంకార్ కాలిబూడిదైపోతాడు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ దేవ్ గతం మర్చిపోయి కొత్త వ్యక్తిలా ప్రవర్తించడం మొదలుపెడతాడు? దేవ్ అలా మారిపోవడానికి కారణం ఏమిటి? మనిషికి మరణం లేకుండా డాక్టర్ శ్రద్ధా చేసిన ఓ 2 ప్రయోగం సక్సెస్ అయ్యిందా?
ఇల్లీగల్‌గా చేసిన ప్రయోగం కారణంగా ఆమె ఎలా చిక్కుల్లో పడింది? శ్రద్ధానాయక్‌కు, మృత్యుంజయ్‌కి ఉన్న పాత పగలకు కారణం ఏమిటి? శ్రద్ధాను ప్రాణంగా ప్రేమించిన ఆర్‌జే ఓషో (రాఘవ్ నాయక్) ఆమెకు ఎలా దూరమయ్యాడు? ఓషోకు ఓంకార్ ఉన్న సంబంధం ఏమిటి? దేవ్ ఓషోలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అన్నదే ఓ2 మూవీ కథ.
మెడికల్ థ్రిల్లర్...
ఓ2 మూవీని పర్టిక్యూలర్‌గా ఓ జానర్ సినిమా అని చెప్పడం కష్టం. తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌తో మొదలై...మెడికల్ థ్రిల్లర్‌గా టర్న్ చివరకు ఓ హారర్ ఎలిమెంట్‌తో సినిమా ముగుస్తుంది. అంతర్లీనంగా ఓ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కూడా రన్ అవుతుంది. ఓ మల్టీజానర్ మూవీగా దర్శకద్వయం రాఘవ్ నాయక్, ప్రశాంత్ రాజ్ ఈ మూవీని తెరకెక్కించారు.
మనిషికి మరణం లేకుండా...
చనిపోయిన మనిషిని తిరిగి బతికించే ప్రయోగం అనే మెయిన్ కాన్సెప్ట్‌ను దర్శకద్వయం ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. ఈ పాయింట్ చుట్టూ లవ్‌స్టోరీ, థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాను నడిపించారు.
నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే...
తాము చెప్పలనుకున్న కథను స్ట్రెయిట్‌గా కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్‌లను చూపిస్తూ చివరి వరకు సస్పెన్స్‌ను హోల్డ్ చేయడం ఆకట్టుకుంటుంది. ఓ వైపు ఓషో, శ్రద్ధా లవ్‌స్టోరీ...మరోవైపు ఓ2 ప్రయోగాన్ని సక్సెస్ చేయడానికి శ్రద్ధా అండ్ టీమ్ చేసే ప్రయత్నాలతో సినిమా ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఓషో ఏమయ్యాడు? రాఘవ్ ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నాడని క్లైమాక్స్‌లోనే ఓ సర్‌ప్రైజ్ ట్విస్ట్‌గా రివీల్ చేయడం బాగుంది.
సింపుల్ అండ్ డెప్త్...
మెడికల్ థ్రిల్లర్ సినిమాల్లో డ్రగ్స్ పేర్లు, సైంటిఫిక్ టర్మినాలజీ ఆడియెన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఈ సినిమాలో ఓ2 ప్రయోగం గురించి డెప్త్‌గా కాకుండా సింపుల్‌గా అందరికి అర్థమయ్యేలా రాసుకోవడం బాగుంది. లవ్‌స్టోరీని పొయేటిక్‌గా నాచురల్‌గా నడిపించారు.నిడివి కూడా గంట నలభై నిమిషాల లోపే ఉండటం కూడా ప్లస్సయింది.
రివేంజ్ డ్రామా బోర్…
ఓ2 ప్రయోగాన్ని సక్సెస్ చేయాలని శ్రద్ధా చేసే ప్రయత్నాలు సాదాసీదాగా అనిపిస్తాయి. వాటిని మరికొంత డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది. మృత్యుంజయ్, శ్రద్ధా మధ్య ఈగో క్లాస్, శ్రద్ధాపై రివేంజ్ కోసం అతడు వేసే ఎత్తులు బోరింగ్‌గా అనిపిస్తాయి.
సెటిల్డ్ యాక్టింగ్...
డాక్టర్ శ్రద్ధా పాత్రలో ఆషికా రంగనాథ్ సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రేమకు, వృత్తికి మధ్య సంఘర్షణకు లోనయ్యే అమ్మాయిగా తన నటనతో ఇంప్రెస్ చేసింది. ఓషో పాత్రలో రాఘవ్ నాయక్ నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచాడు. అతడే ఈ సినిమాకు ఓ దర్శకుడు కావడంతో పాత్రకు ఎంత కావాలో అంతే ఎమోషన్స్ పండిస్తూ మెప్పించాడు. దేవ్‌గా ప్రవీణ్ తేజ్ నటన ఒకే అనిపిస్తుంది. నెగెటివ్ షేడ్ పాత్రలో ప్రకాష్, హీరోయిన్ తండ్రిగా గోపాలకృష్ణ దేశ్‌పాండే తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఎంగేజింగ్ మెడికల్ థ్రిల్లర్...
ఓ2 సింపుల్ అండ్ ఎంగేజింగ్ మెడికల్ థ్రిల్లర్ మూవీ. ఆషికా రంగనాథ్ యాక్టింగ్, కథ,తో పాటు చిన్న చిన్న ట్విస్ట్‌లతో మంచి థ్రిల్లర్ సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్‌ను కలిగిస్తుంది.
టాపిక్