Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..-ambati arjun is bigg boss telugu 8 buzz new anchor he replaces geetu royal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..

Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 27, 2024 09:48 PM IST

Bigg Boss Telugu 8 Buzz Anchor: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ బజ్‍కు యాంకర్ ఎవరో వెల్లడైంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే ఈ కార్యక్రమానికి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సీజన్‍లో బజ్‍కు యాంకరింగ్ చేయనున్నారు అంబటి అర్జున్.

Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..
Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. బిగ్‍బాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీన షూరూ కానుంది. ఈ సీజన్‍కు కూడా సీనియర్ హీరో, కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. కాగా, ఈ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్ ఎవరో వెల్లడైంది. ఈ సీజన్‍లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బజ్‍లో ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈ బజ్‍కు కొత్త యాంకర్ ఎవరో నేడు (ఆగస్టు 27) ఓ ప్రోమోతో ప్రకటించింది స్టార్ మా ఛానెల్.

యాంకర్‌గా అంబటి అర్జున్

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ బజ్‍కు టీవీ యాక్టర్ అంబటి అర్జున్ యాంకరింగ్ చేయనున్నారు. గత సీజన్‍లో ఫైనల్‍కు వెళ్లి ఐదో స్థానంలో నిలిచారు అర్జున్. హౌస్‍లో మంచి ఎంటర్‌టైన్‍మెంట్ పంచారు. గత సీజన్‍లో గీతూ రాయల్ ఈ బజ్ కార్యక్రమం చేశారు. ఇక 8వ సీజన్‍లో బజ్‍కు అంబటి అర్జున్ హోస్ట్ చేయనున్నారు.

ప్రోమో ఇలా..

బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు సంబంధించిన ఓ ప్రోమోను నేడు స్టార్ మా ఛానెల్ వెల్లడించింది. ఈ ప్రోమోలో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు అర్జున్. టైమ్ బాగున్న కొందరు బిగ్‍బాస్ హౌస్‍కు వస్తున్నారంటూ చెప్పారు. టైమ్ బ్యాడ్ అయిన కంటెస్టెంట్లు బజ్‍కు వస్తారంటూ డైలాగ్‍లు చెప్పారు. “లోపల తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు.. యమ హాటు” అనే డైలాగ్‍లో ఈ ప్రోమో ఫినిష్ అయింది.

బిగ్‍బాస్ బజ్ ఎప్పుడంటే..

బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్ సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు స్టార్ ఛానెల్‍లో మొదలుకానుంది. ఈ సీజన్ సెప్టెంబర్ 1న షురూ కానుంది. సెప్టెంబర్ 7న తొలి ఎలిమినేషన్ ఉంటుంది. మొదట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‍ను ఇంటర్వ్యూ చేసిన బజ్ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు టెలికాస్ట్ కానుంది. ప్రతీ వారం ఎలిమినేట్ అయిన వారిని అంబటి అర్జున్ ఇంటర్వ్యూ చేయనున్నారు.

సీజన్ లాంచ్ ఈవెంట్ టైమ్ ఇదే

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 1వ తేదీన రాత్రి 7 గంటలకు మొదలుకానుంది. ఈ ఈవెంట్‍లో కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున పరిచయం చేయనున్నారు. ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లు హౌస్‍లోకి వెళతారు. ఈసారి ఎంటర్‌టైన్‍మెంట్, ఫన్, ట్విస్టులకు లిమిట్ లేదంటూ ఇప్పటికే కొన్ని ప్రోమోలు వచ్చాయి.

బిగ్‍బాస్ 8వ సీజన్ కూడా స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍‍లో కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీజన్‍‍లో డ్యాన్సర్ పండు, యాక్టర్ ఆదిత్య ఓమ్, కమెడియన్ ఖయ్యూమ్, యూట్యూబర్లు కిర్రాక్ సీత, బెజవాడ బేబక్క, డ్యాన్సర్ నిహారిక, యాంకర్ రితూ చౌదరి, టీవీ యాక్టర్ అంజలి పావని ఈ సీజన్‍లో కంటెస్టెంట్లుగా ఉంటారని రూమర్లు ఉన్నాయి. మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. కంటెస్టెంట్లు ఎవనేది సెప్టెంబర్ 1న గ్రాండ్ లాంచ్‍లో అధికారికంగా వెల్లడి కానుంది.