Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది.. ‘ట్విస్టులకు లిమిటే లేదు’: వీడియో-bigg boss telugu 8 new promo released nagarjuna hits limitless twists and turns this season watch now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది.. ‘ట్విస్టులకు లిమిటే లేదు’: వీడియో

Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది.. ‘ట్విస్టులకు లిమిటే లేదు’: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 11, 2024 07:13 PM IST

Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి మరో ప్రోమో వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన టీజర్‌కు కొనసాగింపుగా ఈ ప్రోమో అడుగుపెట్టింది. ఈ సీజన్‍లో ట్విస్టులకు లిమిట్ లేదంటూ హైప్ పెంచారు హోస్ట్ కింగ్ నాగార్జున.

Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది.. ‘ట్విస్టులకు లిమిటే లేదు’: వీడియో
Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది.. ‘ట్విస్టులకు లిమిటే లేదు’: వీడియో

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ కోసం ఈ రియాల్టీ షో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఏడు సీజన్లు బాగా సక్సెస్ అయ్యాయి. 8వ సీజన్ కూడా త్వరలోనే రానుంది. కొంతకాలంగా ఈ కొత్త సీజన్‍ ప్రమోషన్లను స్టార్ మా ఛానెల్ మొదలుపెట్టింది. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍కు కూడా సీనియర్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ సీజన్‍కు సంబంధించిన ఇటీవలే ఓ టీజర్ వచ్చింది. దీనికి కొనసాగింపుగా నేడు (ఆగస్టు 11) మరో ప్రోమోను స్టార్ మా ఛానెల్ వదిలింది.

ప్రోమో ఇలా..

బిగ్‍బాస్ 8 నుంచి వచ్చిన ఈ కొత్త ప్రోమోలోనూ హోస్ట్ నాగార్జున, కమెడియన్ సత్య ఉన్నారు. దొంగతనానికి వచ్చిన సత్య తనకు అన్నీ అన్‍లిమిటెడ్‍గా కావాలంటే.. సరేనని నాగార్జున చెప్పడంతో ఇటీవల వచ్చిన టీజర్ ముగిసింది. ఇప్పుడు వచ్చిన కొత్త టీజర్ దానికి కొనసాగింపుగా అడుగుపెట్టింది. సత్యను ఓ లగ్జరీ హౌస్‍లోకి నాగార్జున తీసుకెళ్లడంతో ఈ నయా ప్రోమో షురూ అయింది. అక్కడ అందమైన అమ్మాయిలతో నాగ్ డ్యాన్స్ చేస్తారు.

“దేఖో.. దేఖో మస్త్ ఆటే బిగ్‍బాస్” అంటూ సాంగ్ ఉంది. ఆ హౌస్‍లో సత్య ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, తనకు ఏకాంతం కావాలని సత్య అంటే మరోసారి ఆలోచించుకోవాలని నాగార్జున చెబుతారు. ఒక్కసారి కమిటైతే లిమిట్ లేదని అంటారు. తనకు ఫుల్ ప్రైవసీ కావాలని సత్య అంటారు. ఆ తర్వాత ఎడారిలో మాసిన దుస్తులతో సత్య కనిపిస్తారు. “ఈసారి సీజన్ 8లో ఎంటర్‌టైన్‍మెంట్, ఫన్‍కు, టర్న్‌లకు, ట్విస్టులకు లిమిటే లేదు” అని నాగార్జున చెప్పే డైలాగ్‍లో ప్రోమో ముగిసింది.

అయితే, బిగ్‍బాస్ 8వ సీజన్ ఎప్పుడు మొదలుకానున్నది ఈ ప్రోమోలోనూ స్టార్ మా ఛానెల్ వెల్లడించలేదు. త్వరలో అనే చెప్పింది. అయితే, సెప్టెంబర్ 8వ తేదీన ఈ సీజన్ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. త్వరలోనే డేట్‍ను ఆ ఛానల్ వెల్లడించే అవకాశం ఉంది.

సత్యను ఒంటరిగా వేరే చోటికి పంపడం ఈ ప్రోమోలో ఉండటంతో బిగ్‍బాస్ 8వ సీజన్‍లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అనే అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్‍లో రెండు హౌస్‍లు ఉంటాయనే రూమర్లు విపరీతంగా వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై అధికారికంగా కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు.

కంటెస్టెంట్లు వీరేనా?

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కంటెస్టెంట్లుగా ఎవరు వస్తారన్నది కూడా ఉత్కంఠగా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సీజన్‍లో పాల్గొంటాడని రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. లావణ్యతో రిలేషన్‍పై ఇటీవలే వివాదంలో ఇరుక్కున్నారు రాజ్. బిగ్‍బాస్‍కు వచ్చేలా అతడితో నిర్వాహకులు చర్చలు జరిపినట్టు పుకార్లు ఉన్నాయి. కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూం ఈ సీజన్‍లో కంటెస్టెంట్‍గా ఉండడం ఖాయమని తెలుస్తోంది. సీరియల్ యాక్టర్ అంజలి పావని, కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, యాంకర్ రితూ చౌదరి, ఆస్ట్రాలజర్ వేణు స్వామి సహా మరికొందరి పేర్లు ఈ సీజన్ కోసం వినిపిస్తున్నాయి. అయితే, అఫీషయల్‍గా ఇంకా ఎవరి పేర్లు వెల్లడి కాలేదు.