Bigg Boss Telugu 8 Grand Launch: బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ రోజే.. డేట్, టైమ్ రివీల్ చేసిన స్టార్ మా-bigg boss telugu 8 grand launch on september 1st 7 pm star maa channel reveals the date akkineni nagarjuna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Grand Launch: బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ రోజే.. డేట్, టైమ్ రివీల్ చేసిన స్టార్ మా

Bigg Boss Telugu 8 Grand Launch: బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ రోజే.. డేట్, టైమ్ రివీల్ చేసిన స్టార్ మా

Hari Prasad S HT Telugu
Aug 21, 2024 02:50 PM IST

Bigg Boss 8 Telugu Start Date: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ గ్రాండ్ లాంచ్ కు టైమ్ ఫిక్సయింది. ఈ విషయాన్ని బుధవారం (ఆగస్ట్ 21) స్టార్ మా వెల్లడించింది. హోస్ట్ అక్కినేని నాగార్జున, కమెడియన్ సత్యతో రూపొందించిన స్పెషల్ ప్రోమోను మరోసారి పోస్ట్ చేస్తూ కొత్త సీజన్ ప్రారంభ తేదీ, సమయం రివీల్ చేసింది.

బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ రోజే.. డేట్, టైమ్ రివీల్ చేసిన స్టార్ మా
బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ రోజే.. డేట్, టైమ్ రివీల్ చేసిన స్టార్ మా

Bigg Boss 8 Telugu Start Date: బిగ్ బాస్ తెలుగు 8కు ప్రారంభానికి ముహూర్తం ఫిక్సయింది. ఊహించినట్లే ఈ సరికొత్త సీజన్ సెప్టెంబర్ 1నే ప్రారంభం కానుంది. 8వ సీజన్ గ్రాండ్ లాంచ్ విషయాన్ని స్టార్ మా తమ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈసారి ట్విస్టులకు అసలు కొదవే లేదంటూ ప్రోమోను రిలీజ్ చేసి లాంచ్ డేట్ వెల్లడించింది.

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు అని స్టార్ మా ఛానెల్ తెలిపింది. "ఈసారి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్టులు, టర్న్స్ కి లిమిటే లేదు. లిమిట్‌లెస్ సీజన్ 8 కోసం సిద్ధంగా ఉన్నారా? గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు వస్తోంది" అనే క్యాప్షన్ తో కొత్త సీజన్ ప్రారంభం విషయాన్ని వెల్లడించింది.

దీనికి హోస్ట్ అక్కినేని నాగార్జున, కమెడియన్ సత్యతో రూపొందించిన స్పెషల్ ప్రోమోను జత చేసింది. ఇక్కడ ఒక్కసారి కమిటైతే.. లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పే డైలాగుతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాకన్నీ అన్‌లిమిటెడ్ గా కావాలి అంటూ కమెడియన్ సత్య ఎంట్రీ ఇస్తాడు. ఈ స్పెషల్ ప్రోమోను స్టార్ మా కొన్నాళ్ల కిందట రిలీజ్ చేయగా.. ఇప్పుడు గ్రాండ్ లాంచ్ డేట్ రివీల్ చేస్తూ కూడా ఇదే వీడియోను పోస్ట్ చేసింది.

బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్లపై ఇప్పటి వరకూ స్టార్ మా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఈసారి హౌజ్ లోకి వీళ్లు వస్తున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు కూడా వినిపించినా.. నాగ చైతన్య, శోభిత ఇష్యూతో అతన్ని పక్కన పెట్టేసినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈసారి హౌజ్ లోకి.. తెలుగు సీరియల్ నటుడు ఇంద్రనీల్ వర్మ, నటి షనూర్ సన, నటి తేజస్విని గౌడ, మోడల్ రవి తేజ, టీవీ నటి రీతూ చౌదరి, హాట్ యాంకర్ విష్ణు ప్రియ భీమినేని, కమెడియన్ బబ్లూ, సీరియల్ నటి పవిత్ర, టీవీ యాంకర్ అంజలి పవన్ లాంటి వాళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మరో స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం పేరు కూడా వినిపిస్తోంది.