Allu Arjun Trivikram Movie: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. బడ్జెట్ ఎంతో తెలుసా?-allu arjun trivikram movie budget heroine and other interesting details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Trivikram Movie Budget Heroine And Other Interesting Details

Allu Arjun Trivikram Movie: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. బడ్జెట్ ఎంతో తెలుసా?

Hari Prasad S HT Telugu
Nov 22, 2023 04:59 PM IST

Allu Arjun Trivikram Movie: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్, బడ్జెట్ పై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ బజ్ తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ

Allu Arjun Trivikram Movie: టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటైన అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా కోసం కలిసి పని చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం చేస్తున్న త్రివిక్రమ్.. తర్వాత బన్నీతో జత కట్టనున్నాడు. ఇప్పటికే వీళ్లు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టారు.

ఇక ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇండస్ట్రీలో క్రియేటైంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వేసవి సమయానికి ప్రారంభం కానుంది. ఈ పాన్ ఇండియా మూవీ భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో ఓ పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాను ఏకంగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు తెలిసింది.

ఇక అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష నటించనున్నట్లు కూడా సమాచారం. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం రేసులో త్రిష ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్, లియో మూవీలతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరైన త్రిష.. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరోసారి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన బజ్ చాలా ఆసక్తి రేపుతున్నా.. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు త్రివిక్రమ్.. గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

గుంటూరు కారం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. అటు పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

IPL_Entry_Point