Chiranjeevi: దటీజ్ మెగాస్టార్...త్రిష హ్యాండిచ్చిన... చిరంజీవి మాత్రం సపోర్ట్ చేశారు
Chiranjeevi: త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. మహిళల్ని అగౌరవ పరిచేలా మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ ఉన్నాయని ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతోంది.
Chiranjeevi: త్రిషపై కోలీవుడ్ సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్రసీమలో కలకలం సృష్టిస్తోన్నాయి. త్రిషకు కోలీవుడ్‌తోపాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా త్రిషకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి తప్పుపట్టారు. అలాంటి వ్యాఖ్యలు ఏ మహిళకైనా ఇబ్బందికరంగా ఉంటాయని, అసహ్యాన్ని కలిగిస్తా యని మంగళవారం చిరంజీవి ట్వీట్ చేశాడు.
త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికివచ్చాయని చిరంజీవి ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. మహిళల్ని అగౌరవపరిచేలా మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్టిస్టులకు మాత్రమే కాకుండా ఏ మహిళలకైనా అసహ్యం కలిగేలా ఇబ్బందికరంగా మన్సూర్ అలీఖాన్ మాట్లాడాడు. అతడు వక్రబుద్దితో కొట్టుమిట్టాడుతున్నాడు అని చిరంజీవి అన్నారు. ఈ పోరాటంలో త్రిషకు తాను అండగా నిలబడతానని చిరంజీవి పేర్కొన్నాడు.
ఆమెతో పాటు ఇండస్ట్రీలో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రతి మహిళకు తాను సపోర్ట్‌గా నిలబడతానని చిరంజీవి ట్వీట్ చేశాడు. చిరంజీవి ట్వీట్ వైరల్‌గా మారింది. చిరంజీవి ట్వీట్‌తో ఈ వివాదం మరింత ముదిరింది. మన్సూర్ అలీఖాన్‌పై కోలీవుడ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా మన్సూర్ అలీఖాన్ కామెంట్స్‌ను ఖండించారు. నితిన్‌తో పాటు పలువురు స్టార్స్ కూడా త్రిషకు సపోర్ట్ చేశారు.
త్రిష హ్యాండిచ్చినా...
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ఆచార్య సినిమాలో తొలుత త్రిషను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కానీ షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష ప్రకటించింది. త్రిష తీరుకు చిరంజీవి హర్ట్ అయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా మన్సూర్ అలీఖాన్ వివాదంలో త్రిషకు చిరంజీవి అండగా నిలిచాడు. అతడి మంచి మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు. దటీజ్ మెగాస్టార్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.