Allu Arjun son: నువ్వో ఫ్లవర్, ఫైర్: అల్లు అర్జున్ కొడుకుపై షారుక్ ప్రశంసలు.. బన్నీ రియాక్షన్ చూశారా?
Allu Arjun son: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ తన డంకీ మూవీలోని లుట్ పుట్ గయా పాట పాడటంపై బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ స్పందించాడు. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలగలిపిన వ్యక్తివి అని ప్రశంసించాడు.
Allu Arjun son: అల్లు అర్జున్, షారుక్ ఖాన్ మధ్య సోషల్ మీడియా ఎక్స్ లో నడిచిన స్వీట్ కన్వర్జేషన్ ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ తనయుడు అయాన్ పాడిన పాటపై మొదట షారుక్ స్పందించడం.. దానికి థ్యాంక్స్ చెబుతూ బన్నీ ట్వీట్ చేయడం విశేషం. డంకీ మూవీలోని లుట్ పుట్ గయా అనే పాటను అల్లు అర్జున్ కొడుకు పాడిన వీడియో వైరల్ అయింది.
అల్లు అర్జున్, షారుక్ ట్వీట్స్
ఈ మధ్య కారులో వెళ్తూ అల్లు అర్జున్ కొడుకు అయాన్.. షారుక్ ఖాన్ మూవీ డంకీలోని లుట్ పుట్ గయా అనే పాట పాడాడు. ఆ వీడియోను షారుక్ ఖాన్ ఫ్యాన్స్ క్లబ్ అనే ఎక్స్ అకౌట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన షారుక్ ఖాన్ తనదైన స్టైల్లో స్పందించాడు. అల్లు అర్జున్ పుష్ప మూవీలోని పాపులర్ డైలాగ్ ను గుర్తు చేస్తూ అతని తనయుడిపై షారుక్ ప్రశంసలు కురిపించాడు.
"థ్యాంక్యూ లిటిల్ వన్.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలగలపిన వ్యక్తివి. నేను ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీవల్లీ పాటను మా పిల్లలతో పాడించడానికి ప్రయత్నిస్తా" అని షారుక్ అన్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ అనే డైలాగ్ ను గుర్తుకు తెచ్చేలా షారుక్ ఈ కామెంట్ చేయడం బన్నీతోపాటు అతని అభిమానులను కూడా బాగా ఆకర్షించింది.
ఈ ట్వీట్ పై అల్లు అర్జున్ కూడా వెంటనే స్పందించాడు. "షారుక్ జీ.. అది మీ గొప్పతనం. మీ స్వీట్ మెసేజ్ చూసి చాలా బాగా అనిపించింది. ప్రేమతో.." అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య ఈ స్వీట్ మెసేజ్ లకు కారణమైన అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పైనా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానులు వీటిని రీట్వీట్లు చేస్తున్నారు.
డంకీ మూవీ గురించి..
షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ గతేడాది డిసెంబర్ 21న ప్రభాస్ సలార్ కు పోటీగా రిలీజైన విషయం తెలిసిందే. కింగ్ ఖాన్ కు గతేడాది హ్యాట్రిక్ విజయాన్ని అందించిన సినిమా ఇది. ఈ మూవీలోని లుట్ పుట్ గయా పాట బాగా హిట్టయింది. ఇప్పుడీ పాటనే అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పాడాడు. డంకీ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించింది.
ఇక షారుక్ ఖాన్ ఈ అల్లు అయాన్ పాటతోపాటు మరికొన్ని పోస్టులు కూడా చేశాడు. తన మూవీ కభీ హా కభీ నా మూవీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా అతడు ఓ పోస్ట్ చేశాడు. తన కెరీర్లో తాను చేసిని స్వీటెస్ట్, హ్యాపీయెస్ట్ సినిమా ఇది అని కింగ్ ఖాన్ అన్నాడు. ఇక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా తన భోలీ సీ సూరత్ పాట పాడటంపై కూడా షారుక్ స్పందించాడు.
"మీ ఇద్దరికీ థ్యాంక్స్. చాలా బాగుంది. లవ్ యూ జాన్ సీనా. నా లేటెస్ట్ సాంగ్స్ కూడా నీకు పంపిస్తా. మీ ఇద్దరూ కలిసి పాడాలని అనుకుంటున్నా" అని షారుక్ అన్నాడు.