రూ.10 అయినా పర్లేదు: సినిమా ప్రమోషన్ల కోసం అప్పు అడుగుతున్న యంగ్ హీరో.. క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ..-actor vinoth kishan requested for debt from audience to promote his movie pekamedalu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రూ.10 అయినా పర్లేదు: సినిమా ప్రమోషన్ల కోసం అప్పు అడుగుతున్న యంగ్ హీరో.. క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ..

రూ.10 అయినా పర్లేదు: సినిమా ప్రమోషన్ల కోసం అప్పు అడుగుతున్న యంగ్ హీరో.. క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 25, 2024 09:24 PM IST

Pekamedalu Movie: పేక మేడలు సినిమా ప్రమోషన్ల కోసం ప్రేక్షకులను సాయం అడిగారు హీరో వినోద్ కిషన్. మూవీ రిలీజ్ అయ్యాక వడ్డీతో తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. ఇందుకు ఓ వీడియో రిలీజ్ చేశారు.

Vinoth Kishan: సినిమా ప్రమోషన్ల కోసం అప్పు అడుగుతున్న యంగ్ హీరో.. క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ..
Vinoth Kishan: సినిమా ప్రమోషన్ల కోసం అప్పు అడుగుతున్న యంగ్ హీరో.. క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ..

Pekamedalu Movie: వినోద్ కిషన్ హీరోగా ‘పేకమేడలు’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాపేరు శివ, ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో వినోద్ కిషన్ నెగెటివ్ రోల్స్ చేశారు. ఇప్పుడు అతడు హీరోగా పేకమేడలు చిత్రం వస్తోంది. ఈ మూవీలో అనూష కృష్ణ హీరోయిన్‍గా నటించారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్ల కోసం తమ వద్ద డబ్బు లేదని, ప్రేక్షకులు సాయం చేయాలని వినోద్ కిషన్ కోరారు. ఇందుకు క్యూర్ కోడ్ కూడా ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

వడ్డీతో తిరిగి ఇచ్చేస్తా

ప్రమోషన్ల కోసం తమకు డబ్బు కావాలని, రిలీజ్ అయ్యాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని అన్నారు. రూ.5, రూ.10 అయినా పర్లేదని అన్నారు. “నేను నా పేరు శివ, రీసెంట్‍గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేశాను. తెలుగులో ఫస్ట్ టైమ్ హీరోగా పేకలమేడలు సినిమా చేస్తున్నా. లక్ష్మణ్ అనే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశా. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ మూవీపై చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. కానీ ప్రమోషన్ల దగ్గర ఆలస్యం అవుతోంది. ఎందుకంటే డబ్బులు కావాలి. సాయం చేయండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఐదు రూపాయలు, పది రూపాయలు ఎంతైనా పర్లేదు. కచ్చితంగా సినిమా బాగా ఆడుతుంది. రిలీజ్ అయ్యాక మీ డబ్బును వడ్డీతో కలిపి ఇస్తా. ప్రామిస్” అని వినోద్ కిషన్ ఈ వీడియోలో చెప్పారు.

స్కాన్ చేసి డబ్బు పంపాలని ఈ వీడియోలోనే క్యూఆర్ కోడ్ చూపించారు వినోద్ కిషన్. సాయం చేయాలంటూ ప్రేక్షకులను కోరారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఎంత స్పందన వస్తుందో చూడాలి.

పేకమేడలు మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఈ సినిమాకు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేశ్ వర్రె నిర్మించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు. హరిచరణ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి సృజన అడ్డుసుమిల్లి, హమ్జా అలీ ఎడిటర్లుగా వ్యవహరించారు.

టీజర్ ఇలా..

పేకమేడలు సినిమా ఏడాది క్రితమే రిలీజ్‍కు రెడీ అయింది. అయితే, ఆలస్యమవుతూ వస్తోంది. గతేడాది జూలైలోనే ఈ సినిమా టీజర్ వచ్చింది. ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే యువకుడు లక్ష్మణ్ పాత్రను ఈ చిత్రంలో పోషించారు వినోద్ కిషన్.

రమ్మీ ఆడుతూ, గొడవలు పడుతూ లక్ష్మణ్ (వినోద్) టైమ్‍పాస్ చేస్తుంటాడు. అందరితో తిట్లు తింటుంటాడు. రిచ్‍గా కలలు కంటుంటాడు. ఈ క్రమంలో ఓ ట్విస్ట్ ఉంటుందనేలా టీజర్లో ఉంది. ఈ పాత్ర చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగనుంది. ఈ మూవీని ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

WhatsApp channel