Lok Sabha Elections 2024 : ఓవైసీ అడ్డాపై ప్రత్యర్థి పార్టీల గురి..!-strong candidates from opponent parties will contest the hyderabad lok sabha seat against aimim in 2024 elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024 : ఓవైసీ అడ్డాపై ప్రత్యర్థి పార్టీల గురి..!

Lok Sabha Elections 2024 : ఓవైసీ అడ్డాపై ప్రత్యర్థి పార్టీల గురి..!

HT Telugu Desk HT Telugu
Mar 07, 2024 04:40 PM IST

Hyderabad Lok Sabha Constituency: పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ కేంద్రంగా ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఓవైసీ అడ్డాగా పేరొందిన ఈ స్థానంలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ గట్టిగా భావిస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పావులు కదపుతోంది.

హైదరాబాద్ లోక్ సభ స్థానం
హైదరాబాద్ లోక్ సభ స్థానం

Hyderabad Lok Sabha constituency: రానున్న లోక సభ ఎన్నికల వేళ హైదరాబాద్ కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు మజ్లిస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్,బీజేపీ దూకుడుతో ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.దీంతో ఈసారి అక్కడ ఊహించని ఫలితాలు రాబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలో మలక్ పేట, కార్వన్, గోషాహల్ ,చార్మినార్ చంద్రయాణగుట్ట, యాకత్ పురా ,బహుదూర్పురా నియోజకవర్గాలు ఉన్నాయి. 1984 నుంచి 1999 వరకు ఇక్కడ అప్పటి ఎంఐఎం పార్టీ అధినేత సలావుద్దీన్ ఓవైసీ గెలుపొందగా......నాటి నుంచి నేటి వరకు అసరుద్దీన్ ఓవైసీ ఇక్కడ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.

ఈసారి హైదరాబాద్ లో గెలుపెవరిది....?

హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో గత శాసనసభ ఎన్నికల్లో గోషామహల్ స్థానం బిజెపి గెలుచుకోగా.....యాకుత్పురాల్లో ఎంబిటి కేవలం 878 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక మలక్ పేట స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. ఆ పొరుగు గానే ఉన్న నాంపల్లి సీటును కాంగ్రెస్ కేవలం స్వల్ప ఓట్లతో చేజార్చుకుంది.కాగా గత అసెంబ్లీ ఎన్నికల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ హైదరాబాద్ పరిధిలోని అన్నీ సెగ్మెంట్లలో అభ్యర్థిని పెట్టీ ఓట్లు చీల్చింది.ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, పాతబస్తీలో ఉన్న బిఆర్ఎస్ నేతలు అంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం మొదలు కావడంతో ఇప్పుడు ఓవైసీ వచ్చే ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త ధరలు వెతకాల్సి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారానికే ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్ ఓవైసీ తన నియోజకవర్గంలో వరుసగా అభివృద్ధి పనులను ప్రారంభించడం, పనుల పురోగతిని సమీక్షించడానికి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మార్చి 2న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి గతంలో కంటే బాగా జరిపే ప్రయత్నం చేయటం.... పాతబస్తీ నలుమూలల నుంచి ర్యాలీ తలపెట్టి పెద్ద సంఖ్యలు కార్యకర్తల పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చేలా కార్యక్రమం జరిపారు.

బీజేపీ నుంచి బరిలో కొత్త ముఖం..…

మరోవైపు వైపు కాంగ్రెస్ పార్టీ పాతబస్తీలో ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతులంతా కాంగ్రెస్ వంచన చేరగా..... బీజేపీ లో అసంతృతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.అదే సమయంలో ఎంబిటి పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధపడుతుంది. ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్ వంటి నేతల ప్రచారంతో మైనారిటీల మనసు గెలిచినందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇక ఆది నుంచి హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి గా ఉన్న కమలనాథులు ఈసారి మాధవిలత అనే కొత్త ముఖాన్ని తెరమీదకు తెచ్చారు. సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు హిందీలో మాట్లాడుతూ స్థానికులతో మమేకమవుతుంది. ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో ఇతర అంశాలు చర్చకు రావని ఇక్కడ కేవలం ముస్లింల ప్రతినిధిగా ఓవైసీ ,హిందువుల తరఫున బీజేపీ పార్టీ గుర్తు ,మోది మాత్రమే నిలుస్తారని అదే జరిగితే బీజేపీకి కలిసి వస్తుందని బీజేపీ భావన.

కాంగ్రెస్ ఎంబీటి పొత్తు ఉంటుందా?

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బిఆర్ఎస్ మజ్లిస్ తో తన దోస్తీని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..... గతంలో మాదిరి స్పందన ఎంఐఎం నుంచి మాత్రం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గా అక్బర్ అక్బరుద్దీన్ ఓవైసీకి అవకాశం కల్పించడం, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మూసి తీర ప్రాంతం అభివృద్ధిపై చర్చించడం, హైదరాబాద్ నగర అభివృద్ధిపై జరిగిన సమావేశంలో అక్బరుద్దీన్ మాటకు సీఎం ఇచ్చిన ప్రాధాన్యం కూడా బిఅర్ఎస్ లో గుబులు పుట్టించింది.

మరోవైపు మొన్నటి ఎన్నికల్లో ఎంబీటీ పార్టీ యాకుత్ పురాలో సత్తా చాట గలిగింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీతో స్నేహం కుదిరితే… మజ్లిక్ కు సవాల్ గా మారే అవకాశం ఉంటుంది.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం