Harish Rao Vs Revanth: హరీష్ రాజీనామాకు రెడీ కావాలన్న రేవంత్ రెడ్డి, రైతు రుణమాఫీపై రగడ, పోటాపోటీగా సవాళ్లు-revanth reddy challenge for harishs resignation fight over farmer loan waiver ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Harish Rao Vs Revanth: హరీష్ రాజీనామాకు రెడీ కావాలన్న రేవంత్ రెడ్డి, రైతు రుణమాఫీపై రగడ, పోటాపోటీగా సవాళ్లు

Harish Rao Vs Revanth: హరీష్ రాజీనామాకు రెడీ కావాలన్న రేవంత్ రెడ్డి, రైతు రుణమాఫీపై రగడ, పోటాపోటీగా సవాళ్లు

Sarath chandra.B HT Telugu
Apr 26, 2024 01:26 PM IST

Harish Rao Vs Revanth: తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ రాజుకుంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామాకు రెడీ ఉండాలని సిఎం రేవంత్ ప్రకటించారు.

తెలంగాణ రైతు రుణమాఫీ అమలుపై రేవంత్‌, హరీష్‌ మధ్య సవాళ్లు
తెలంగాణ రైతు రుణమాఫీ అమలుపై రేవంత్‌, హరీష్‌ మధ్య సవాళ్లు

Harish Rao Vs Revanth: తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 ఎన్నికల హామీల అమలు కోసం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే Harish Rao హరీశ్ రావు తన రాజీనామా పత్రంతోGun Park గన్ పార్కుకు చేరుకున్నారు. హరీష్ సవాళ్లకు సిఎం రేవంత్‌ కూడా ప్రతిస్పందించారు. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామాకు రెడీ అవ్వాలన్నారు.

కాంగ్రెస్ Congerssప్రభుత్వం రైతు రుణమాఫీ Loan Waiver, ఆరు గ్యారంటీలు Six guarantees ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలకంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

అవ్వాతాతలకు 4 వేల పింఛన్ రావాలని, వడ్లకు మొక్కజొన్నకు 500 బోనస్ ఇవ్వాలని, రైతుబంధు 15 వేలు వేయాలని డిమాండ్ చేశారు. ఇవేవీ తాము కొత్తగా అడుగుతున్న డిమాండ్లు కావని కాంగ్రెస్ నేతలే స్వయంగా బాండు పేపర్లు రాసిచ్చినవి చెప్పారు. వంద రోజుల్లోగా వీటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ‘

‘ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని సోనియాంగాంధీ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలి. ఆగస్ట్ 15 తేదీ లోపనైనా అని హామీలు అమలు చేస్తే సంతోషం.

నా ఒక్కడి ఎమ్మెల్యే పదవికంటే 4 వేల ఆసరా పింఛన్, 4 వేల నిరుద్యోగ భృతి, మహిళకు 2500 రావడం, 2 లక్షల రుణామాఫీ జరగడం ముఖ్యమన్నారు. ఐదేళ్లు పదవిలో లేకపోయినా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే అంతకంటే సంతోషమేముంది’’ అని హరీష్ రావు అన్నారు.

స్పీకర్ ఫార్మాట్లోనూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, రాజీనామా పత్రాన్ని తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టుల చేతుల్లో పెడుతున్నానని చెప్పారు. ‘‘కాంగ్రెస్ హామీలు నిజమైతే, రేవంత్ భేషజం వల్ల గన్ పార్కుకు రావడానికి ఇష్టం లేకపోతే ఆయన పీఏ ద్వారా లేకపోతే సిబ్బంది ద్వారా పంపాలన్నారు.

స్థూపం వద్ద పూలు పెట్టడానికి ఆయనకు ఇష్టం లేకపోవచ్చని రేవంత్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ హామీలను అమలు చేస్తే నా లేఖను వాళ్లు స్పీకర్‌కు ఇస్తారన్నార. ఆయన ఇస్తారో ఇవ్వరో ఆయన విజ్ఞతకు వదిలిలేస్తున్నాను. రేవంత్ రాజీనామా పత్రాన్ని ఇవ్వకపోతే దేవుళ్ల పేర్ల మీద మళ్లీ మోసం చేస్తారని భావించాల్సి ఉంటుందన్నారు.

హరీష్‌ రావుపై రేవంత్ ఆగ్రహం…

గన్‌పార్క్‌ వద్ద హరీష్ రావు చేసిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తుందన్నారు.

హారీష్ మోసానికి ముసుగుగా అమరవీరుల స్థూపం మారిందన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నాడని, రాజీనామా లేఖ అలా ఉండదన్నారు. హరీష్‌రావు మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని, స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదన్నారు.

హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని, హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందన్నారు. హరీష్ రావు సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామని చెప్పారు. పంద్రాగస్టులోగా తెలంగాణలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాజీనామా రెడీగా పెట్టుకోవాలన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం