PM Modi : వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్, రౌడీ పాలనకు ట్రీట్మెంట్ ఇస్తాం- ప్రధాని మోదీ-rajampet pm modi sensational comments on ys jagan govt count down start ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi : వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్, రౌడీ పాలనకు ట్రీట్మెంట్ ఇస్తాం- ప్రధాని మోదీ

PM Modi : వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్, రౌడీ పాలనకు ట్రీట్మెంట్ ఇస్తాం- ప్రధాని మోదీ

Bandaru Satyaprasad HT Telugu
May 08, 2024 05:47 PM IST

PM Modi : ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజ్య పాలన చేస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వంలో రౌడీ రాజ్యాన్ని తరిమికొడతామన్నారు.

 ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

PM Modi : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రౌడీ రాజ్య పాలన చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. రాజంపేట బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... వైసీపీ ఇసుక మాఫీయా వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి, అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పక్కా ట్రీట్మెంట్ తో రౌడీ రాజ్యాన్ని తరిమికొడుతుందన్నారు. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కోసం, వైసీపీ పని చేసిందని ఆరోపించారు.

ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్

రత్నాలసీమ రాయలసీమ ప్రజల ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చానన్న మోదీ... రాయలసీమలో గనులు, ఖనిజాలు, వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ‌రైతులు, ప్రతిభావంతులైన యువత ఉన్నారని, టూరిజానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధి మోదీ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోదీ ఆకాంక్షించారు. రాయలసీమ నుంచి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి దిల్లీకి పంపితే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రధాని మోదీ అన్నారు. రాయలసీమకు స్వచ్ఛమైన నీరు అందించాలనే తమ సంకల్పానికి సీఎం జగన్ ప్రభుత్వం సహకరించలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి అవుతున్న రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో విరివిగా పండే టమాటా, ఇతర కూరగాయల కోసం శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను నెలకొల్పడం ద్వారా రైతులకు అండగా ఉంటామన్నారు.

"ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు. ఐదేళ్లుగా రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ప్రజల కష్టాలు తీరాలి"- ప్రధాని మోదీ

కాంగ్రెస్ దేశాన్ని విభజిస్తోంది

వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌కు సహకరించలేదని ప్రధాని మోదీ విమర్శించారు. సాండ్ మాఫియాతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. రాయలసీమలో అపార ఖనిజ సంపద ఉందని తెలిపారు. పర్యాటకంగా అనే అవకాశాలు ఉన్నాయన్నారు. పులివెందులలో అరటి రైతుల కోసం క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఇస్తామన్నారు. గత పదేళ్లలో చేపట్టిన మంచి పనులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తానని మోదీ ఆరోపించారు. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసుకుంటానని చెబుతోందన్నారు. రామ మందిరానికి తాళం వేస్తానని కాంగ్రెస్ అంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పనులతో ఇండియాకు గల్ఫ్ దేశాల్లో గౌరవం పెరిగిందన్నారు.

సంబంధిత కథనం