Pawan Kalyan : వల్లభనేని వంశీకి ఓటు వేస్తే మహిళలను కించపరిచినట్లే - పవన్ కల్యాణ్-gannavaram janasena chief pawan kalyan criticizes vallabhaneni vamsi remained allegations on bhuvaneswari ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan Kalyan : వల్లభనేని వంశీకి ఓటు వేస్తే మహిళలను కించపరిచినట్లే - పవన్ కల్యాణ్

Pawan Kalyan : వల్లభనేని వంశీకి ఓటు వేస్తే మహిళలను కించపరిచినట్లే - పవన్ కల్యాణ్

Bandaru Satyaprasad HT Telugu
May 08, 2024 05:05 PM IST

Pawan Kalyan : గన్నవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీ అత్యంత దారుణంగా వంశీ మాట్లాడరన్నారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : వల్లభనేని వంశీకి ఓటు వస్తే మహిళలను కించపరిచేవారికి మద్దతు ఇచ్చినట్లే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం గన్నవరం నియోజకవర్గంలో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్....వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై మండిపడ్డారు. ఆత్మగౌరవం ఉన్నవాళ్లు వైసీపీలో ఉండలేరన్నారు. అందుకే యార్లగడ్డ వెంకట్రావు, బాలశౌరి లాంటి వాళ్లు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారన్నారు. వల్లభనేని వంశీ వివేకం ఉన్న వ్యక్తి అనుకున్నానని, కానీ అలా కాదని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు నిరూపించాయన్నారు. విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలని, గౌరవమైన పదవుల్లో ఉండి దిగజారి బూతులు మాట్లాడకూడదన్నారు. జనసేన మద్దతు దారులు వంశీ మాయలో పడొద్దన్నారు. విపక్షాలను బూతులు తిట్టలేకే యార్లగడ్డ వైసీపీ నుంచి బయటకు వచ్చాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఓటు జనసేనకి, ఎమ్మెల్యే ఓటకు తనకు వేయాలని వంశీ కోరుతున్నారట అది సరికాదన్నారు. ఎన్టీఆర్ కుమార్తెపై వల్లభనేని వంశీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయన్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కించపరిచేలా దుర్భాషలాడరన్నారు. వంశీకి జనసేన మద్దతుదారులు ఓట్లు వేస్తే మహిళలను అగౌరవపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందన్నారు.

రూ.2 వేల కోసం భవిష్యత్తు తాకట్టు పెట్టుకోవద్దు

"చంద్రబాబు సతీమణి అంటే నా సోదరితో సమానం. వైసీపీ వాళ్లు నా సోదరిని అవమానించారు. రేపు మీ ఇంట్లో మహిళలను కూడా వీళ్లు వదలరు. మహిళలు అంటే గౌరవం లేని వైసీపీ వాళ్ళని గెలిపించకండి. జనసేన మద్దతుదారులు వంశీ వలలో పడొద్దన్నారు. రూ.2 వేల కోసం మీ భవిష్యత్తును తాకట్టుపెట్టొద్దన్నారు. "- జనసేన అధినేత పవన్ కల్యాణ్

2014లో జనసేన కూటమికి మద్దతు ప్రకటించినప్పుడు గన్నవరంలో వల్లభనేని వంశీ ఏం చెప్పారో తనకు గుర్తుందన్నారు పవన్. మీరు ప్రచారం చేయడం వల్ల ఎప్పుడూ ఓట్లు పడని ప్రాంతాల్లో కూడా తనకు ఓట్లు పడ్డాయని వంశీ అన్నారన్నారు. వంశీ మంచి నాయకుడు, ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి అనుకున్నానని కానీ వైసీపీ పంచన చేరి ఆయన మారిపోయారని విమర్శించారు. విభేదాలు ఎవరికుండవన్న పవన్....తాను కూడా చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్ తో విభేదించానన్నారు. అయితే విధానపరంగానే విభేదించాను తప్పా, వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

ఎన్టీఆర్ కుమార్తెను దూషించిన వ్యక్తి వంశీ

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్డీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, అన్న ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన పాటలను తన సినిమాల్లో పెట్టుకున్నానన్నారు. కానీ అటువంటి మహనీయుడి కుమార్తెను వల్లభనేని వంశీ అసెంబ్లీలో అత్యంత దారుణంగా మాట్లాడారని, అది తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు, లోకేశ్ తో మీకు విభేదాలు అంటే ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. వంశీ భువనేశ్వరిపై మాట్లాడిన తీరు తనకు బాధ కలిగించిందన్నారు. భువనేశ్వరి తన సోదరితో సమానం అన్నారు. మహిళలకు జనసేన ఎప్పుడూ ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ అన్నారు. జగన్ తో తనకు విభేదాలు ఉన్నాయని కానీ ఆయన సతీమణి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. వంశీకి జనసేన మద్దతుదారులు ఓటు వేస్త స్త్రీని అగౌరవపర్చిన వ్యక్తిని, మన సోదరిని అగౌరవపరిచినట్లే అన్నారు. అందుకే ఓటు ఆయుధంతో సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం