AP Elections 2024 : వెనక్కి తగ్గిన వర్మ... పిఠాపురంలో 'పవన్' పోటీకి లైన్ క్లియర్..!-as part of the alliance the line has been cleared for pawan to contest from pithapuram ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections 2024 : వెనక్కి తగ్గిన వర్మ... పిఠాపురంలో 'పవన్' పోటీకి లైన్ క్లియర్..!

AP Elections 2024 : వెనక్కి తగ్గిన వర్మ... పిఠాపురంలో 'పవన్' పోటీకి లైన్ క్లియర్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 17, 2024 08:36 AM IST

Pawan Contest From Pithapuram 2024: పిఠాపురంలో పొటీ నుంచి వెనక్కి తగ్గారు టీడీపీ ఇంఛార్జ్ వర్మ(SVSN Varma). చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ విజయం కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో పొత్తులో భాగంగా… పవన్ పోటీకి లైన్ క్లియర్ అయిపోయింది.

చంద్రబాబుతో వర్మ
చంద్రబాబుతో వర్మ

Pawankalyan Contest From Pithapuram 2024: వచ్చే ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram) నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత… స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న SVSN వర్మ…. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఓ దశలో నిర్ణయం ప్రకటించేందుకు కూడా సిద్ధమయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగటంతో… వివాదం సద్దుమణిగింది.

వెనక్కి తగ్గిన వర్మ….

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ…. చివరికి వెనక్కి తగ్గారు. శనివారం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. పిఠాపురం సీటు ఖరారు అంశంపై మాట్లాడారు. పొత్తులో భాగంగా… పవన్ అక్కడ్నుంచి పోటీ చేస్తానని చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… వర్మకు హామీనిచ్చారు. ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పారు. 2014లో పోటీకి దూరంగా ఉండి కూడా మనకు పవన్ మద్దతు ఇచ్చారని… ఈసారి కూడా ప్రభుత్వ ఓటు చీలవద్దన్న ఉద్దేశ్యంతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారని, అలాంటి నేతను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వర్మ మాట్లాడుతూ….. పవన్ గెలుపునకు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పిఠాపురం సీటును గెలిచి బహుమతిగా ఇస్తామన్నారు. వర్మ వెనక్కి తగ్గటంతో పిఠాపురం సీటు విషయంలో పవన్ కి లైన క్లియర్ అయిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా,,,, ఈసారి ఇదే సీటు నుంచి పోటీ చేయనున్నారు పవన్.

ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన... ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీతా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేవలం 1,036 ఓట్ల తేడాతో వర్మ ఓటమిపాలయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం వర్మ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దొరబాబుపై 47,080 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్ ను దక్కించుకున్నారు వర్మ. అయితే ఈసారి ఆయన ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కించుకొని విక్టరీ కొట్టాలని గట్టిగా భావించారు వర్మ. అయితే పొత్తులో భాగంగా.... ఈ సీటును జనసేనకు వెళ్లింది.

పొత్తులో భాగంగా పిఠాపురం(Pithapuram) నుంచి తమ నేత(మాజీ ఎమ్మెల్యే వర్మ) కాకుండా పవన్ పోటీ చేయటంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే పవన్ ప్రకటన చేసిన తర్వాత…. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వర్మకే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. వర్మకు కాకుండా పవన్ కల్యాణ్ పోటీ చేస్తే… మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్…. ఈసారి కూడా అక్కడ్నుంచే చేయాలంటూ హితవు పలికారు. ఈ క్రమంలోనే… టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి… వర్మతో చర్చలు జరిపారు. దీంతో వర్మ కూడా వెనక్కి తగ్గి… పవన్ విజయం కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు.