WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా పైకి.. ఆస్ట్రేలియాకు చేరువగా..-wtc points table india move to 2nd place after defeating england in 2nd test cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wtc Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా పైకి.. ఆస్ట్రేలియాకు చేరువగా..

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా పైకి.. ఆస్ట్రేలియాకు చేరువగా..

Hari Prasad S HT Telugu
Feb 05, 2024 03:33 PM IST

WTC Points Table: ఇంగ్లండ్ ను రెండో టెస్టులో చిత్తుగా ఓడించిన టీమిండియా మరోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల టేబుల్లో పైకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ఐదు నుంచి రెండో స్థానానికి వెళ్లడం విశేషం.

డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరిన టీమిండియా
డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరిన టీమిండియా (PTI)

WTC Points Table: ఇంగ్లండ్ చేతుల్లో తొలి టెస్టులో ఓడిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల టేబుల్లో ఐదో స్థానానికి పడిపోయిన టీమిండియా.. రెండో టెస్టు విజయంతో మళ్లీ పైకి దూసుకెళ్లింది. తాజాగా విశాఖపట్నంలో 106 పరుగులతో ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఇండియన్ టీమ్.. ఆరు నుంచి రెండో స్థానానికి, ఆస్ట్రేలియాకు చేరువగా వెళ్లడం విశేషం.

డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ ఇదీ

హైదరాబాద్ టెస్టులో ఓటమి తర్వాత ఇండియన్ టీమ్ టాప్ ప్లేస్ నుంచి ఏకంగా ఐదో స్థానానికి పోడిపోయింది. ఇక తాజా విజయంతో టీమిండియా పర్సెంటేజ్ 52.77కు చేరింది. 55 పర్సెంటేజ్ తో టాప్ లో ఉన్న ఆస్ట్రేలియాకు చేరువగా వెళ్లింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లను రోహిత్ సేన వెనక్కి నెట్టింది.

ఆస్ట్రేలియా 10 మ్యాచ్ లలో 6 విజయాలు, 3 ఓటములు, ఒక డ్రాతో 66 పాయింట్లు, 55 పర్సెంటేజీతో టాప్ లో కొనసాగుతోంది. ఇక ఇండియన్ టీమ్ 6 టెస్టుల్లో మూడు విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో 38 పాయింట్లు, 52.77 పర్సెంటేజ్ తో రెండో స్థానంలో ఉంది. తర్వాతి మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. రెండేసి మ్యాచ్ లు ఆడి, ఒకటి గెలిచి, మరొకటి ఓడి.. 50 పర్సెంటేజ్ తో మూడు నుంచి ఐదో స్థానం వరకూ ఉన్నాయి.

విశాఖ టెస్టు విజయం

ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగినా తొలి టెస్టులోనే టీమిండియాకు షాక్ తగిలింది. 28 పరుగుల తేడాతో ఓడిపోయి డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఇక రెండో టెస్టుకు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉంది. దీనికితోడు తొలి టెస్టులో రాణించిన కేఎల్ రాహుల్, జడేజా గాయాలతో దూరమయ్యారు.

కోహ్లి ఇంకా అందుబాటులోకి రాలేదు. రోహిత్ బ్యాట్ తో విఫలమయ్యాడు. ఈ సమయంలో తొలి ఇన్నింగ్స్ లో యశస్వి వీరోచిత డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్ సెంచరీ, మ్యాచ్ మొత్తంలో పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీయడం టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టింది. బజ్‌బాల్ స్టైల్ నుంచి వెనక్కి తగ్గని ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో తగిన మూల్యమే చెల్లించింది.

సిరీస్ గెలుస్తారా?

రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకున్న ఇండియన్ టీమ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ లో మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ లైనప్ బలంగా మారనుంది. బౌలింగ్ లో బుమ్రా, అశ్విన్ టాప్ ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్ లో ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

అయితే ఇంగ్లండ్ దూకుడును తక్కువగా అంచనా వేయలేం. తొలి టెస్టులో అలాగే గెలిచిన ఆ టీమ్.. రెండో టెస్టులో ఓటమి ముంగిట కూడా వెనక్కి తగ్గకుండా పోరాడింది. అటాకింగ్ క్రికెట్ తో ఇండియన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలని చూసినా అది ఫలించలేదు. మూడో టెస్టులో ఆ టీమ్ బలంగా పుంజుకొని మరింత ఎదురుదాడి చేసే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner