Virat Kohli Birthday: విరాట్ కోహ్లి బర్త్ డే.. అభిమానులకు 70 వేల కోహ్లి మాస్క్‌లు.. అదిరిపోయే ప్లాన్-virat kohli birthday eden gardens to gift 70000 kohli masks to fans ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Birthday: విరాట్ కోహ్లి బర్త్ డే.. అభిమానులకు 70 వేల కోహ్లి మాస్క్‌లు.. అదిరిపోయే ప్లాన్

Virat Kohli Birthday: విరాట్ కోహ్లి బర్త్ డే.. అభిమానులకు 70 వేల కోహ్లి మాస్క్‌లు.. అదిరిపోయే ప్లాన్

Hari Prasad S HT Telugu
Oct 31, 2023 01:27 PM IST

Virat Kohli Birthday: విరాట్ కోహ్లి బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి ఈడెన్ గార్డెన్స్ నిర్వాహకులు పెద్ద ప్లానే వేస్తున్నారు. అభిమానులకు ఏకంగా 70 వేల కోహ్లి మాస్క్‌లు ఇవ్వనుండటం విశేషం.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

Virat Kohli Birthday: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నవంబర్ 5న తన 35వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. అదే రోజు సౌతాఫ్రికాతో టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతోంది. దీంతో కోహ్లికి మరుపురాని బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వినూత్న ఆలోచన చేస్తోంది.

ఈ మ్యాచ్ చూడటానికి వచ్చే సుమారు 70 వేల మంది అభిమానులకు విరాట్ కోహ్లి మాస్కులను అందజేయనుండటం విశేషం. ఈ మ్యాచ్ టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. దీంతో ఈడెన్ లో ఫుల్ హౌజ్ మధ్య కోహ్లి తన బర్త్ డేనాడు మ్యాచ్ ఆడనున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లితో కేక్ కటింగ్ చేయించడంతోపాటు ఓ జ్ఞాపికను కూడా అందజేయనున్నారు.

అయితే ఈ స్పెషల్ ఈవెంట్ కోసం తాము ఐసీసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ వెల్లడించారు. ఆ రోజు స్టేడియంలోకి అడుగు పెట్టే ప్రతి అభిమాని కోహ్లి మాస్క్ ధరించాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అందుకే ఆ రోజు 70 వేల మాస్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పదేళ్ల కిందట అంటే నవంబర్, 2013లో సచిన్ టెండూల్కర్ ఈడెన్ గార్డెన్స్ లోనే తన 199వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పుడు కూడా స్టేడియం మొత్తం సచిన్ నామ స్మరణతో మార్మోగిపోయింది. ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ కు ముందు ఇండియా.. శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గురువారం (నవంబర్ 2) జరగనుంది.

ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ లలోనూ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉన్న టీమిండియా.. శ్రీలంకపై గెలిస్తే నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ లతో మరో రెండు మ్యాచ్ లు ఉంటాయి. ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ లపై విజయాలు సాధించింది.

Whats_app_banner