Team India in Rajkot: రాజ్‌కోట్‌లో టీమిండియా రాజభోగాలు.. రోహిత్ శర్మకు స్పెషల్ రూమ్-team india in rajkot for 3rd test against england presidential suit for rohit sharma in sayaji hotel ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India In Rajkot: రాజ్‌కోట్‌లో టీమిండియా రాజభోగాలు.. రోహిత్ శర్మకు స్పెషల్ రూమ్

Team India in Rajkot: రాజ్‌కోట్‌లో టీమిండియా రాజభోగాలు.. రోహిత్ శర్మకు స్పెషల్ రూమ్

Hari Prasad S HT Telugu
Feb 12, 2024 11:32 AM IST

Team India in Rajkot: ఇంగ్లండ్ తో మూడో టెస్టు కోసం గుజరాత్ లోని రాజ్‌కోట్ వెళ్లిన టీమిండియా రాజభోగాలు అనుభవిస్తోంది. అక్కడి సయాజీ హోటల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రెసిడెన్షియల్ సూట్ ఇవ్వడం విశేషం.

రాజ్‌కోట్ హోటల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్పెషల్ సూట్
రాజ్‌కోట్ హోటల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్పెషల్ సూట్ (PTI)

Team India in Rajkot: ఇంగ్లండ్ తో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో గెలిచిన వారం రోజుల తర్వాత టీమిండియా మూడో టెస్టు జరగబోయే రాజ్‌కోట్ చేరుకుంది. వచ్చే గురువారం (ఫిబ్రవరి 15) నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం రాజ్‌కోట్ వచ్చిన ఇండియన్ టీమ్ కు సయాజీ హోటల్లో బస ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు టీమ్ ఇక్కడే ఉండనుంది.

రోహిత్ శర్మకు స్పెషల్ సూట్

ఆదివారం (ఫిబ్రవరి 11) టీమిండియా రాజ్‌కోట్ చేరుకుంది. ఫిబ్రవరి 19 వరకూ అక్కడి సయాజీ హోటల్లోనే టీమ్ ఉంటుంది. అయితే జట్టులోని కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లకు హోటల్లోని సౌరాష్ట్ర థీమ్ తో ఉన్న స్పెషల్ సూట్ లను ఇవ్వడం విశేషం. ఇక టీమ్ మొత్తానికి కఠియావాడీ స్పెషల్ వంటకాలను వడ్డిస్తున్నారు.

సౌరాష్ట్ర రాచరిక వైభవం ఉట్టిపడేలా రాయల్ హెరిటేజ్ థీమ్ తో ఉన్న ప్రెసిడెన్షియన్ సూట్ ను రోహిత్ శర్మకు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ హోటల్స్ లో ఉండే ప్లేయర్స్ కు ఎప్పుడూ పాశ్చాత్య దేశాల్లో ఉండే రూమ్స్ లాంటివే కనిపిస్తాయని, వాళ్లకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించాలన్న ఉద్దేశంతో తాము ఈ ప్రయత్నం చేసినట్లు సయాజీ హోటల్ డైరెక్టర్ ఉర్వేష్ పురోహిత్ చెప్పినట్లు ఆజ్‌తక్ వెల్లడించింది.

టీమిండియాకు గుజరాతీ స్పెషల్ ఫుడ్

టీమిండియాకు మంగళవారం (ఫిబ్రవరి 13) స్పెషల్ గుజరాతీ, కఠియావాడీ ఫుడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఉర్వేష్ చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఫఫ్డా జిలేబీ, ఖాఖ్రా, గటియా, తేప్లా వంటివి ఉండగా.. లంచ్, డిన్నర్ కోసం దహీ టికారీ, వాఘెర్లా రోట్లో, కిచిడీ కాధి లాంటి కఠియావాడీ స్పెషల్ వంటకాలు చేయనున్నారు. ఈ కఠియావాడీ ఫుడ్ టీమిండియా ప్లేయర్స్ కు బాగా నచ్చుతుందని హోటల్ డైరెక్టర్ అన్నారు.

ఫిబ్రవరి 15 నుంచి 19 వరకూ మూడో టెస్టు జరగనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నంలలో రెండు టెస్టులు జరిగాయి. 1-1తో రెండు టీమ్స్ సమంగా ఉన్నాయి. ఇప్పుడు మూడో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది చూడాలి. ఈ మూడు టెస్టుల కోసం ఈ మధ్యే జట్టును అనౌన్స్ చేయగా.. కోహ్లి పూర్తిగా దూరమయ్యాడు. రాహుల్, జడేజా తిరిగి వచ్చినా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఈ మ్యాచ్ ఆడనున్నారు.

శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరం కావడంతో రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరూ జట్టుతోనే ఉన్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ తిరిగి వస్తే అతడు శ్రేయస్ వచ్చే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.

మూడు టెస్టులకు టీమిండియా ఇదే

రోహిత్ శర్మ, బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్

Whats_app_banner