Musheer Khan: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు - మూడు నెలలు క్రికెట్‌కు దూరం
Musheer Khan: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్‌ఖాన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సర్ఫరాజ్‌ఖాన్, ముషీర్‌ఖాన్‌తో పాటు వారి తండ్రి నౌషద్‌ఖాన్ కలిసి ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
Musheer Khan: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్‌ఖాన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ముషీర్‌ఖాన్ కూడా క్రికెటరే. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. రికార్డ్ సెంచరీతో రాణించాడు.
కారు పల్టీలు కొట్టడంతో...
అన్నయ్య సర్ఫరాజ్‌ఖాన్, తండ్రి నౌషద్‌ఖాన్‌తో కలిసి ముషీర్‌ఖాన్... ఆజాంఘర్ నుంచి లక్నోకు ప్రయణిస్తోన్న సమయంలో వారి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ముషీర్‌ఖాన్ మెడకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. సర్ఫరాజ్‌ఖాన్, నౌషద్‌ఖాన్ స్వల్ప గాయలతో ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ముషీర్‌ఖాన్‌తో పాటు సర్ఫరాజ్‌ఖాన్ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నట్లు తెలిసింది. ముషీర్‌ఖాన్ ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని, కానీ అతడు పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలలపైనే సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సచిన్ రికార్డ్ బద్దలు...
ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో ముషీర్‌ఖాన్ అదరగొట్టాడు. ఇండియా ఏ టీమ్ తరఫున బరిలో దిగిన ముషీర్‌ఖాన్ ఇండియా బీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 181 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో వికెట్‌కు నవదీస్ సైనీతో కలిసి 208 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు.
దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లో హయ్యెస్ట్ స్టోర్ చేసిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. సచిన్ రికార్డును అధిగమించాడు. సచిన్...దులీప్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్‌లో 159 రన్స్ చేశాడు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు.
డబుల్ సెంచరీ...
ఈ ఏడాది రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో పాటు అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అండర్ 19 వరల్డ్ కప్‌లో ముషీర్‌ఖాన్ వెలుగులోకి వచ్చాడు. దులీప్ ట్రోఫీలో ముషీర్ బ్యాటింగ్ తీరు చూసి తొందరలోనే అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా త్వరలో ప్రారంభం కానున్న ఇరానీ ట్రోఫీకి ముషీర్‌ఖాన్
దూరమయ్యాడు. దేశవాళీలో ముంబాయి జట్టుకు ముషీర్‌ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ముషీర్‌ఖాన్ 51. 14యావరేజ్‌తో 714 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండటం గమనార్హం.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌తో...
ముషీర్‌ఖాన్ అన్నయ్య సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టీమ్ తరఫున ఆడాడు సర్ఫరాజ్ ఖాన్.
టాపిక్