WTC Points Table: శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్‌లోకి సౌతాఫ్రికా.. టీమిండియాకు ఇంకా ఛాన్సుందా?-wtc points table south africa tops after clean sweeping sri lanka team india in third ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wtc Points Table: శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్‌లోకి సౌతాఫ్రికా.. టీమిండియాకు ఇంకా ఛాన్సుందా?

WTC Points Table: శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్‌లోకి సౌతాఫ్రికా.. టీమిండియాకు ఇంకా ఛాన్సుందా?

Hari Prasad S HT Telugu
Dec 09, 2024 04:04 PM IST

WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో శ్రీలంకను చిత్తు చేసి సౌతాఫ్రికా టాప్ లోకి దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయం, ఆస్ట్రేలియా చేతుల్లో రెండో టెస్టులో దారుణమైన ఓటమితో టీమిండియా మూడో స్థానానికి దిగజారింది.

శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్‌లోకి సౌతాఫ్రికా.. దిగజారిన టీమిండియా
శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్‌లోకి సౌతాఫ్రికా.. దిగజారిన టీమిండియా (AFP)

WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీలంకను రెండు టెస్టుల సిరీస్ లో 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా ఒకేసారి టాప్ లోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. ఈ సిరీస్ విజయంతో సౌతాఫ్రికా మరొక్క టెస్టులో గెలిస్తే చాలు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది.

yearly horoscope entry point

టాప్‌లోకి సౌతాఫ్రికా టీమ్

ఆస్ట్రేలియా చేతుల్లో టీమిండియా రెండో టెస్టులో ఓటమి.. ఇటు శ్రీలంకపై సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ తో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ మారిపోయింది. తొలి స్థానంలోకి వెళ్లిన సౌతాఫ్రికా.. ఇప్పుడు పాకిస్థాన్ తో జరగబోయే రెండు టెస్టుల్లో ఒకదాంట్లో గెలిచినా ఫైనల్ వెళ్తుంది.

డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికా, పాకిస్థాన్ రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సఫారీలు ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లడంతో ఆస్ట్రేలియా రెండు, టీమిండియా మూడో స్థానంలోకి పడిపోయాయి. ఈ సిరీస్ ఓటమితో శ్రీలంక మాత్రం ఫైనల్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లయింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ ఇలా

సౌతాఫ్రికా ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 10 టెస్టులు ఆడి ఆరు గెలిచి, మూడు ఓడిపోయింది. ఒకటి డ్రా అయింది. 76 పాయింట్లు, 63.33 పర్సెంటేజ్ తో టాప్ లో ఉంది. ఇక ఆస్ట్రేలియా టీమ్ 14 మ్యాచ్ లు ఆడి 9 గెలిచింది. మరో నాలిగింట్లో ఓడగా.. ఒకటి డ్రా అయింది.

102 పాయింట్లు, 60.71 పర్సెంటేజ్ తో రెండో స్థానంలో ఉంది. టీమిండియా విషయానికి వస్తే 16 టెస్టుల్లో 9 గెలిచి, ఆరు ఓడింది. ఒకటి డ్రా అయింది. 110 పాయింట్లు, 57.29 పర్సెంటేజ్ తో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి.

టీమిండియాకు ఇంకా ఛాన్స్ ఉందా?

ఆస్ట్రేలియా చేతుల్లో రెండో టెస్టులో ఓడిపోవడంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలకు పెద్ద దెబ్బే పడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే మిగిలిన మూడు టెస్టుల్లోనూ గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయి ఇండియన్ టీమ్ 3-2తో సిరీస్ గెలిచినా.. ఫైనల్ ఛాన్స్ ఉంటుంది. అయితే అప్పుడు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆ టీమ్ తన హోమ్ సిరీస్ లో ఆస్ట్రేలియాను 2-0తో ఓడించాల్సి ఉంటుంది.

సౌతాఫ్రికా మరొక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్ చేరుతుంది. మరో స్థానం కోసం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీ ఉంది. దీంతో ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. రెండు ఫైనల్ స్థానాల కోసం మూడు టీమ్స్ పోటీ పడుతున్నాయి. మరి సౌతాఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియాలలో ఫైనల్ చేరే టీమ్స్ ఏవో మరో నెల రోజుల్లో తేలనుంది.

Whats_app_banner