Prabhas Sreeleela: ఎన్ని కోట్లు ఇచ్చిన ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీర్, శ్రీలీల ఈ పనులు అస్సలు చేయరు! ఎందుకంటే?
Prabhas Mahesh Babu Jr NTR Never Do Such Things In Life: ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిన సరే జీవితంలో అస్సలు చేయని కొన్ని పనులు ఉన్నాయి. మరి అవేంటీ, ఎందుకు చేయరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Telugu Heroes Never Do Things In Life: స్టార్ హీరోలు వారు చేసే సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటారు. పారితోషికంతోనే కాకుండా ఫ్యాన్స్, ఛరిష్మా, క్రేజ్ ఇలా అన్ని రకాలుగా తెలుగులో స్టార్ హీరోలుగా స్టార్‌డమ్ సంపాదించుకున్నారు ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. అయితే, వీరికి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిన కొన్ని పనులను జీవితంలో అస్సలు చేయరట. మరి ఆ పనులేంటీ?, అవి ఎందుకు చేయరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్‌గా విపరీతంగా పెరగడంతో పలు బ్రాండింగ్ సంస్థలు డార్లింగ్‌ను అప్రోచ్ అయ్యాయట. ఓ బ్రాండ్‌కు ప్రమోషన్ చేయమని, అందుకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారట. అయితే, ముందు నుంచే బ్రాండింగ్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న ప్రభాస్ వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడని టాక్.
మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు కోట్లు ఇచ్చిన చేయని పని హిందీ సినిమాల్లో నటించడం. ఈ విషయాన్ని ఓ ఈవెంట్‌లో మహేశ్ బాబు ఓపెన్‌గా చెప్పాడు. తనను వాళ్లు భరించలేరని మహేశ్ బాబు చేసిన కామెంట్స్ కాస్తా కాంట్రవర్సీ కూడా అయ్యాయి.
టాలీవుడ్‌లో విపరీతమైన స్టార్‌డమ్ ఉన్న మహేశ్ బాబుకు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చుకోలేం, అందుకే ఆయన అలా అన్నారు అని కంగనా రనౌత్ సపోర్ట్ కూడా చేసింది. మహేశ్ బాబు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతాయ్ కానీ డైరెక్ట్ హిందీ చిత్రాలు చేసే ఛాన్స్ లేదు.
జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్‌గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమాల్లో ఎలాంటి పాత్రతోపాటు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసి అదరగొడతాడు ఎన్టీఆర్. అలాంటి తారక్ ఒక్క పాత్రను మాత్రం జీవితంలో చేయను అని చెప్పాడు. అదే తారక్ తాత, స్వర్గీయ నందమూరి సీనియర్ ఎన్టీఆర్ పాత్ర.
కోట్లు ఇచ్చిన సరే సీనియర్ ఎన్టీఆర్ పాత్ర గానీ, ఆయనకు ఎంతో పేరు తెచ్చిన శ్రీకృష్ణుడి పాత్రను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అస్సలు వేయడు. అందుకు ఉదాహరణే ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ. ఈ సినిమాలో కృష్ణుడి పాత్రను ఎన్టీఆర్‌నే వేయమని నిర్మాత సి అశ్వనీదత్ కోరారు.
బ్లర్ చేసి
కానీ, ఆ పాత్రను ఆయన తప్పా ఇంకెవరు మ్యాచ్ చేయలేరని, తాను కూడా చేయలేనని, ఆ అర్హత తనకు లేదని, జీవితంలో ఆ పాత్ర వేయను అని తారక్ రెజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఆ సినిమాలో కృష్ణుడి పాత్ర వేసిన తమిళ యాక్టర్ కృష్ణ కుమార్ మొహాన్ని బ్లర్ చేసి చూపించారని టాక్.
శోభన్ బాబు
కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న లెజండరీ హీరో, దివంగత శోభన్ బాబు. ఎన్నో సినిమాల్లో హీరోగా అలరించిన శోభన్ బాబు ఎన్ని కోట్లు ఇచ్చిన చేయని పని సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేయడం. తన అభిమానులు ఆయన్ను హీరోగానే గుర్తుంచుకోవాలని అలా చేసినట్లు టాక్. అంతేకాకుండా ఒక పాయింట్ తర్వాత సినిమాలు మానేస్తే మళ్లీ ఎలాంటి పాత్ర చేయను అని గట్టిగా భీష్మించుకున్నారట శోభన్ బాబు.
అందుకు ఉదాహరణ అతడు మూవీ. మహేశ్ బాబు నటించిన అతడు మూవీలో నాజర్ పాత్రకు ముందుగా శోభన్ బాబును అనుకుని చాలా రిక్వెస్ట్ చేశారట. కానీ, ఒక్కసారి నటన వద్దనుకున్నాక మళ్లీ మొహంపై మేకప్ వేసుకోనని శోభన్ బాబు చెప్పారట.
శ్రీలీల- మీనాక్షి చౌదరి
ఇటీవల పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టిన శ్రీలీల మళ్లీ స్పెషల్ సాంగ్స్ చేయనని గట్టిగా చెప్పేసింది. ఎన్నికోట్లు ఇచ్చిన సరే మరోసారి ఐటమ్ సాంగ్ చేయనని నిర్ణయించుకుందట శ్రీలీల. అలాగే, లక్కీ భాస్కర్ మూవీలో తల్లిగా, హీరోకు భార్యగా ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి మరోసారి అలాంటి పాత్రలు చేయకూడదని డిసైడ్ అయినట్లు ఇటీవల చెప్పుకొచ్చింది.
టాపిక్