Suryakumar Mumbai Indians : సూర్యకుమార్ యాదవ్ ఫిట్.. ముంబై ఇండియన్స్ కష్టాలు తీరినట్టేనా?
Mumbai Indians IPL 2024 : ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్ లభించింది! ఆ జట్టు డాషింగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సాధించాడు.
Mumbai Indians vs Delhi Capitals : ఐపీఎల్ 2024లో అష్టకష్టాలు పడుతున్న ముంబై ఇండియన్స్‌కి తీపి కబురు! ఆ జట్టు డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫిట్ అయ్యాడు. ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతనిపై ముంబై ఇండియన్స్ అభిమానులు ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. దిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో సూర్య మెరుపులు చూడాలని భావిస్తున్నారు.
సూర్య రాకతో ఎంఐ పరిస్థితి మారుతుందా..?
ఈ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. వాస్తవానికి ఎంఐకి ఇది కొత్తేమి కాదు. గతంలో సీజన్‌ని దారుణంగా మొదలుపెట్టి, చివరికి.. టైటిల్‌ని ఎగరేసుకుపోయిన సందర్భం ఉంది. కానీ అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎక్కడికి వెళ్లినా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ జట్టుపై, జట్టు యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నట్టు, వచ్చే ఐపీఎల్‌కి ముంబైని వదిలేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి మధ్య.. జట్టు ప్రదర్శన దెబ్బతింటోంది.
సరిగ్గా ఈ సమయంలో.. జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. పైగా.. త్వరలోనే 2024 టీ20 వరల్డ్ కప్ ఉండటంతో.. ఐపీఎల్‌ని బాగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. చీలమండలి గాయం కారణంగా మూడు నెలల పాటు రెస్ట్ తీసుకుని రికవరీ అయ్యాడు సూర్య. హెర్నియాకు కూడా సర్జరీ చేయించుకున్నాడు. ఇక ఇప్పుడు ఫ్రెష్‌గా బరిలో దిగుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా చురుకుగా కనిపిస్తున్నాడు. అతడి రాక.. ముంబై ఇండియన్స్‌ని కచ్చితంగా బలపరుస్తుంది.
Mumbai Indians IPL 2024 : వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టులో టాలెంట్‌కి కొదవలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ నుంచి.. తిలక్ వర్మ వరకు ప్లేయర్లు చాలా టాలెంటెడ్. కానీ సరైన సమయంలో ఎవరూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయలేకపోతుండటమే ఇక్కడ అసలైన సమస్య. ఈ లోటును భర్తీ చేసే సామర్థ్యం సూర్యకుమార్ యాదవ్‌కి ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక దిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరగనునన్న మ్యాచ్ హార్దిక్ పాండ్యాకు కూడా చాలా కీలకం. తన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలంటే.. అటు ప్లేయర్‌గా ఇటు కెప్టెన్‌గా కచ్చితంగా రాణించాల్సి ఉంటుంది. మరి అతను ఏ మేరకు ప్రభావం చూపిస్తాడో వేచి చూడాలి.
SuryaKumar Yadav IPL 2024 : ఇక డీసీ విషయానికొస్తే.. ఐపీఎల్ 2024లో ఆ జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. రిషభ్ పంత్ తిరిగి జట్టులో చేరడం మేజర్ ప్లాస్ పాయింట్ అయినప్పటికీ.. జట్టుని ఎవరు గెలిపించకలేకపోతుండటం ఆందోళనకర విషయం. ఆడిన 4 మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్కటి గెలిచి.. పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది డీసీ. ముంబై.. చివరి స్థానంలో ఉంది. ఇక ఆదివారం జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలని డీసీ ప్లాన్స్ వేస్తోంది. మరి ఎవరు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
సంబంధిత కథనం