IPL 2024: ఐపీఎల్‌కు స్టార్ పేసర్ దూరం - 2024 సీజన్‌కు దూరమైన కీలక ఆటగాళ్లు వీళ్లే!
IPL 2024: ఐపీఎల్ నుంచి స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్ నుంచి దూరమవుతోన్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ మొత్తం ఆడటం లేదు.
IPL 2024: ఐపీఎల్ క్రికెట్ సమరం మరో వారం రోజుల్లో మొదలుకానుంది. మార్చి 22న జరుగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్...రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఐపీఎల్ ఆరంభానికి ముందు స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరిగా షాకిస్తున్నారు. గాయాలు, వ్యక్తిగత సమస్యలతో ఐపీఎల్ 2024లో సీజన్‌కు దూరమవుతున్నారు. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్న ప్లేయర్ల లిస్ట్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ లిస్ట్‌లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి చేరాడు.
ఢిల్లీ క్యాపిటల్స్...
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు లుంగి ఎంగిడి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యాభై లక్షల బేస్ ధరకు లుంగి ఎంగిడిని ఢిల్లీ కొనుగోలు చేసింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు తాను దూరం అవుతున్నట్లు శుక్రవారం లుంగి ఎంగిడి ప్రకటించాడు. అతడి స్థానాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రెజర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది.
ఢిల్లీకే చెందిన మరో స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కూడా వ్యక్తిగత సమస్యలతో ఐపీఎల్ ఆడటం లేదని అనౌన్స్‌చేశాడు. హ్యారీ బ్రూక్‌ను నాలుగు కోట్ల వేలంలో ఢిల్లీ కొనుగులు చేసింది. బ్యాటింగ్ పరంగా ఈ సీజన్‌లో బ్రూక్ జట్టుకు కీలకం కానున్నాడని భావించింది. కానీ ఫ్రాంచైజ్‌కు షాకిచ్చిన హ్యారీ బ్రూక్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఢిల్లీ జట్టులోకి ఎవరు వస్తారన్నది క్లారిటీ రాలేదు.
కోల్‌కతాకు ఇద్దరు దూరం...
కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ నుంచి ఈ సీజన్‌కు ఇద్దరు క్రికెటర్లు దూరమయ్యాడు. ఇంగ్లండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్ ఐపీఎల్ 2024 ఆడటం లేదు. వ్యక్తిగత సమస్యల వల్ల జేసన్ రాయ్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో ఫిలిప్ సాల్ట్ టీమ్‌లోకి వచ్చాడు. అలాగే మరో ఇంగ్లండ్ ప్లేయర్ అట్కిన్సన్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకోవడం అతడి ప్లేస్‌లో శ్రీలంక క్రికెటర్ దుష్మంత చమీర జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
ప్రసిద్ధ్ కృష్ణ...
గాయం కారణంగా రాయస్థాన్ రాయల్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ ఐపీఎల్ ఆడటం లేదు. రంజీ ట్రోఫీలో గాయపడ్డ అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అలాగే చెన్నై హిట్టర్ డెవాన్ కాన్వే వేలి గాయంతో ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ, డెవాన్ కాన్వే రీప్లేస్‌మెంట్స్‌ను ఆయా ఫ్రాంచైజ్‌లు ఇప్పటివరకు ప్రకటించలేదు.
స్టార్ పేసర్ షమీ...
టీమిండియా స్టార్ పేసర్ షమీ కూడా మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు షమీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత ఏడాది గుజరాత్ ఫైనల్ చేరుకోవడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. షమీ దూరం కావడం గుజరాత్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
గుజరాత్ టైటాన్స్ మరో క్రికెటర్ మాథ్యూ వేడ్ కూడా ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్క్ వుడ్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని మార్క్‌వుడ్‌కు బోర్డ్ ఎన్‌వోసీ ఇవ్వలేదని సమాచారం.