Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌లోని ఈ కొత్త మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్ చూశారా.. బ్యాటర్ల తికమక-new mystery spinner in pakistan cricket batters struggling to get him cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌లోని ఈ కొత్త మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్ చూశారా.. బ్యాటర్ల తికమక

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌లోని ఈ కొత్త మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్ చూశారా.. బ్యాటర్ల తికమక

Hari Prasad S HT Telugu
Mar 01, 2024 04:46 PM IST

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ లోకి ఓ కొత్త మిస్టరీ స్పిన్నర్ వచ్చాడు. అతని బౌలింగ్ ఆడలేక బ్యాటర్లు తికమక పడుతున్నారు. తాజాగా అతని బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ క్రికెట్ లోకి వచ్చిన సరికొత్త మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్
పాకిస్థాన్ క్రికెట్ లోకి వచ్చిన సరికొత్త మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్

Pakistan Cricket: భారత ఉపఖండం నుంచి మిస్టరీ స్పిన్నర్లు తరచూ వస్తూనే ఉంటారు. సాధారణంగా శ్రీలంక క్రికెట్ లో ఇలాంటి స్పిన్ బౌలర్లు ఎక్కువ. కానీ ఈసారి పాకిస్థాన్ క్రికెట్ లో అలాంటి ఓ మిస్టరీ స్పిన్నర్ వచ్చాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న ఆ బౌలర్ పేరు ఉస్మాన్ తారిఖ్ కాగా.. అతని బౌలింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్

భారత ఉపఖండం కాకుండా ఇతర క్రికెట్ దేశాల బ్యాటర్లు స్పిన్ ఆడటానికి ఇబ్బంది పడతారు. అందులోనూ మిస్టరీ స్పిన్నర్లు అయితే మరింత తికమకపడతారు. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అలాంటిదే జరిగింది. కాస్త టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వేసినట్లుగా ఉస్మాన్ తారిఖ్ అనే ఆ స్పిన్నర్ రనప్ లో కాస్త ఆగి బౌలింగ్ చేస్తుండటంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఈ ఉస్మాన్ తారిఖ్.. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అతని స్పిన్ అర్థం చేసుకోలేక ఇద్దరు బ్యాటర్లు వికెట్ల ముందు దొరికిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తారిఖ్ బౌలింగ్ యాక్షన్ కాస్త భిన్నంగా ఉంది. బౌలింగ్ చేయడానికి వస్తూ మధ్యలో కాసేపు ఆగి తర్వాత బంతిని విసురుతున్నాడు.

ఇది బ్యాటర్లను అయోమయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా వేగంగా సాగిపోయే టీ20 క్రికెట్ లో ప్రతి బంతినీ బాదాలని బ్యాటర్లు భావిస్తారు. బంతి ఎప్పుడు పిచ్ అవుతుందా అనే తొందరలో ఉంటారు. ఇలాంటి సమయంలో తారిఖ్ ఇలా తన యాక్షన్ ను కాసేపు పాజ్ చేసి వేస్తుండటం బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది.

కరాచీ కింగ్స్ కు చెందిన బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, జేమ్స్ విన్సీ.. తారిఖ్ బౌలింగ్ సరిగా చదవలేక వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ మ్యాచ్ లో మిస్టరీ స్పిన్నర్ తారిఖ్ 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. తారిఖ్ ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్ వివరించాడు.

"అతని దగ్గర క్యారమ్ బాల్ ఉంది. అంతేకాదు కచ్చితమైన లైనప్ తో వేస్తున్నాడు. స్పిన్ కూడా చాలా తక్కువగా బ్యాట్ ను బీట్ చేసేలా ఉంది. ఇదే బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది" అని మిస్బా అన్నాడు.

Whats_app_banner