తెలుగు న్యూస్ / ఫోటో /
Babar Azam Record: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్
- Babar Azam Record: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ లీగ్ లో 3000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.
- Babar Azam Record: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ లీగ్ లో 3000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.
(1 / 5)
Babar Azam Record: పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ లో 3 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ పై 68 రన్స్ చేసిన బాబర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అతడు 78 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.
(2 / 5)
Babar Azam Record: బాబర్ ఆజం తర్వాత మరో పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఫఖర్ 78 మ్యాచ్ లలో 2387 రన్స్ చేశాడు. అతడు లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడుతున్నాడు.
(3 / 5)
Babar Azam Record: ఇక పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానంలో మరో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఉన్నాడు. అతడు కరాచీ కింగ్స్, ముల్తాన్ సల్తాన్స్, పెషావర్ జల్మీ జట్లకు కలిపి 2135 రన్స్ చేశాడు.
(4 / 5)
Babar Azam Record: నాలుగో స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. అతడు కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడి 2007 రన్స్ చేశాడు.
ఇతర గ్యాలరీలు