IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకునే ఛాన్స్.. ఇక ఆ అవకాశం ఉండదు-ipl mega auction bcci allows 5 retentions says a report may scrap right top match card ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకునే ఛాన్స్.. ఇక ఆ అవకాశం ఉండదు

IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకునే ఛాన్స్.. ఇక ఆ అవకాశం ఉండదు

Hari Prasad S HT Telugu
Sep 25, 2024 10:12 PM IST

IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఫ్రాంఛైజీకి ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం.

ఐపీఎల్ మెగా వేలం.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకునే ఛాన్స్.. ఇక ఆ అవకాశం ఉండదు
ఐపీఎల్ మెగా వేలం.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకునే ఛాన్స్.. ఇక ఆ అవకాశం ఉండదు (IPL)

IPL Mega Auction: ఐపీఎల్లో వచ్చే ఏడాది టీమ్స్ అన్నీ మరోసారి కొత్త లుక్ తో కనిపించనున్నాయి. దీనికి కారణం ఐపీఎల్ 2025కు ముందు జరగబోయే మెగా వేలం. చివరిసారి 2022 ఐపీఎల్ కోసం మెగా వేలం జరిగింది. మూడు సీజన్లు ముగియడంతో ఇప్పుడు మరోసారి మెగా ఆక్షన్ నిర్వహించనున్నారు. అయితే ఇందులో ఒక్కో ఫ్రాంఛైజీకి ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు వెల్లడించింది.

ఐదుగురికి ఛాన్స్..

ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఫ్రాంఛైజీలు డిమాండ్ చేస్తున్నట్లు ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వనున్నట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. దీనిపై ఇప్పటి వరకూ బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోకపోయినా.. అదే జరగబోతోందని ఆ రిపోర్టు స్పష్టం చేసింది.

ఇక ఈ వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డును తొలగించనున్నట్లు సమాచారం. ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే అవకాశం ఇస్తుండటంతో ఇక దీనితో పనిలేదని బోర్డు భావిస్తోంది. ఈ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా తాము మొదట రిలీజ్ చేసిన ప్లేయర్ ను వేలంలో తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఆ ప్లేయర్ కోసం ఏదైనా ఇతర ఫ్రాంఛైజీ వేలంలో ఎంత ఇవ్వడానికి సిద్ధపడిందో ఆ మొత్తం ఇచ్చిన పాత ఫ్రాంఛైజీయే అతన్ని తీసుకోవడానికి వీలుంటుంది. అయితే తాజాగా జరగబోయే మెగా వేలంలో ఈ రైట్ టు మ్యాచ్ కార్డును తొలగించాలని బోర్డు భావిస్తోంది.

కీలకమైన ప్లేయర్స్‌ను కొనసాగించేలా..

చాలా వరకు ఫ్రాంఛైజీలు తమ జట్టులోని కీలకమైన ప్లేయర్స్ ను కొనసాగించేలా చూసుకుంటున్నాయి. దీనికోసమే ముగ్గురి కంటే ఎక్కువ ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో గరిష్ఠంగా నలుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.

ఇప్పుడు ఐదుగురు ప్లేయర్స్ కు అనుమతి ఇస్తే.. తమ జట్లలోని కీలక ప్లేయర్స్ తమతోనే ఉండే అవకాశం దక్కుతుంది. వేలంలో ఈ కోర్ టీమ్ చుట్టూ మిగిలిన ప్లేయర్స్ తో టీమ్ ను నిర్మించుకోవాలని ఆయా ఫ్రాంఛైజీలు చూస్తున్నాయి. నిజానికి గత నెలలోనే రిటెన్షన్, మెగా వేలంపై చర్చించడానికి ఫ్రాంఛైజీలతో బీసీసీఐ సమావేశమైంది.

అయితే ఇందులో గత కొన్ని సీజన్లలో సక్సెస్ అయిన ఫ్రాంఛైజీలు ఎక్కువ రిటెన్షన్ల కోసం పట్టుబట్టాయి. దీనివల్ల తమ టీమ్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉంటుందని ఆ ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ పెద్దగా సక్సెస్ చూడని ఫ్రాంఛైజీలు మాత్రం మొత్తంగా అందరు ప్లేయర్స్ తో మెగా వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. వేలంలోకి కీలక ప్లేయర్స్ వస్తే వాళ్ల ద్వారా తమ జట్లను పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనతో ఈ ఫ్రాంఛైజీలు ఉన్నాయి.