IPL All Time Greatest Team: ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ ఇదే.. ధోనీ కెప్టెన్.. 8 మంది ఇండియన్స్
IPL All Time Greatest Team: ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ ను అనౌన్స్ చేశారు. మొత్తం 15 మందితో కూడిన ఈ జట్టుకు కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీని ఎంపిక చేయగా.. మొత్తంగా 8 మంది ఇండియన్ ప్లేయర్స్ చోటు దక్కించుకోవడం విశేషం.
IPL All Time Greatest Team: ఐపీఎల్ 2024కు టైమ్ దగ్గర పడుతున్న వేళ ఈ మెగా లీగ్ లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ ను సెలెక్షన్ ప్యానెల్ అనౌన్స్ చేసింది. ఊహించినట్లు ఈ లీగ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడైన ఎమ్మెస్ ధోనీయే ఈ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 18) ఈ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జట్టును ప్రకటించారు. 8 మంది ఇండియన్స్, ఏడుగురు విదేశీ ప్లేయర్స్ ఈ 15 మంది జట్టులో ఉన్నారు.
ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ ఇదే
ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ ను ఎంపిక చేసిన సెలెక్షన్ ప్యానెల్లో మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్ ఉన్నారు. వీళ్లతోపాటు 70 మంది జర్నలిస్టులు కూడా ఈ ఎంపికలో పాలుపంచుకున్నారు. 2008 నుంచి 2023 వరకూ 16 సీజన్ల పాటు ఐపీఎల్లో మెరుగ్గా రాణించిన ప్లేయర్స్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఊహించినట్లే ఈ ఐపీఎల్ ద్వారా క్రికెట్ అభిమానులకు మరింత చేరువైన ప్లేయర్స్ అందరూ ఈ టీమ్ లో ఉన్నారు. ఇండియా నుంచి ధోనీతోపాటు విరాట్ కోహ్లి, మిస్టర్ ఐపీఎల్ గా పేరుగాంచిన సురేశ్ రైనా, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు చోటు దక్కింది.
ఇక ఐపీఎల్ పై తమదైన ముద్ర వేసిన విదేశీ ప్లేయర్స్ లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, ఒరిజినల్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, రషీద్ ఖాన్, లసిత్ మలింగా కూడా ఈ ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ టీమ్ లో ఉన్నారు.
టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ ఇదీ
ఈ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ లో ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లిలను ఎంపిక చేయడం విశేషం. ఓపెనర్ గా విధ్వంసం సృష్టించిన క్రిస్ గేల్ ను మూడో స్థానంలో ఉంచారు. మిడిలార్డర్లో సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్, ధోనీ, హార్దిక్ పాండ్యా, జడేజా, పొలార్డ్ లాంటి వాళ్లు ఉన్నారు. స్పిన్ విభాగంలో చహల్ తోపాటు రషీద్ ఖాన్, సునీల్ నరైన్ ఉన్నారు.
పేస్ బౌలింగ్ లో లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన జట్టులో ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనిపై స్టార్ స్పోర్ట్స్ ఇంక్రెడిబుల్ 16 ఆఫ్ ఐపీఎల్లో సౌతాఫ్రికా మాజీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ స్పందించాడు. "హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా అద్భుతమైన లీడరే. ఇది కఠినమైన నిర్ణయమే. కానీ నేను మాత్రం ధోనీకే కెప్టెన్, కోచ్ గా ఓటేస్తాను" అని స్టెయిన్ అన్నాడు.
ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్
ఎమ్మెస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యుజువేంద్ర చహల్, లసిత్ మలింగ, బుమ్రా