IPL 2025 Retentions: ఐపీఎల్ 2025.. మొత్తం 10 ఫ్రాంఛైజీలు రిటెయిన్ చేసుకున్న ప్లేయర్స్ జాబితా ఇదే.. కోహ్లికి రూ.21 కోట్లు
IPL 2025 Retentions: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు మొత్తం 10 ఫ్రాంఛైజీలు తాము రిటెయిన్ చేసుకున్న ప్లేయర్స్ పూర్తి జాబితాను రిలీజ్ చేశాయి. గురువారం (అక్టోబర్ 31) చివరి రోజు కావడంతో ఒకేసారి అన్ని ఫ్రాంఛైజీలు వాళ్ల పేర్లను వెల్లడించాయి. అత్యధికంగా విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు దక్కాయి.
IPL 2025 Retentions: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ లీగ్ లోని పది ఫ్రాంఛైజీలు తాము రిటెయిన్ చేసుకునే ప్లేయర్స్ జాబితాను విడుదల చేశాయి. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్ఠంగా ఐదుగురిని రిటెయిన్ చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ముగ్గురు ప్లేయర్స్ నే రిటెయిన్ చేసుకోగా.. అందులో విరాట్ కోహ్లికే రూ.21 కోట్లు చెల్లించడం విశేషం. సన్ రైజర్స్ అయితే క్లాసెన్ కు ఏకంగా రూ.23 కోట్లు చెల్లిస్తోంది. మరి ఏ ఫ్రాంఛైజీ ఏయే ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకున్నాయో ఒకసారి చూద్దాం.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోవడంతోపాటు రైట్ టు మ్యాచ్ కార్డు కింద వేలంలోనూ మరో ప్లేయర్ ను తీసుకునే అవకాశం కల్పించారు. ఈ సారి మెగా వేలంలో ఒక్కో టీమ్ గరిష్ఠంగా రూ.120 కోట్లు ఖర్చు చేసే వీలుండగా.. ఈ రిటెయినర్ల వల్ల ఒక్కో టీమ్ గరిష్ఠంగా రూ.75 కోట్లను ఇప్పుడే ఖర్చు చేయనున్నాయి. మరి పది ఫ్రాంఛైజీలు ఏయే ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకున్నాయి? వాళ్లకు ఎంత చెల్లిస్తున్నాయన్నది ఇక్కడ చూడండి.
సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తోపాటు మొత్తం ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. వీళ్లలో ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్ కాగా ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు. ఇక హెన్రిచ్ క్లాసెన్ కు ఏకంగా రూ.23 కోట్లు ఇవ్వడం విశేషం. రిటెయినర్స్ లో అత్యధిక మొత్తం అందుకున్న ప్లేయర్ అతడే.
ప్యాట్ కమిన్స్ - రూ.18 కోట్లు
అభిషేక్ శర్మ - రూ.14 కోట్లు
నితీష్ రెడ్డి - రూ.6 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్ - రూ.23 కోట్లు
ట్రావిస్ హెడ్ - రూ.14 కోట్లు
సన్ రైజర్స్ ఐదుగురు ప్లేయర్స్ పైనే రూ.77 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం.
ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది.
జస్ప్రీత్ బుమ్రా: రూ.18 కోట్లు
సూర్యకుమార్ యాదవ్: రూ.16.35 కోట్లు
హార్దిక్ పాండ్యా: రూ.16:35 కోట్లు
రోహిత్ శర్మ: రూ.16:30 కోట్లు
తిలక్ వర్మ: రూ.8 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.55 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ ఊహించినట్లే అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా ధోనీని రిటెయిన్ చేసుకుంది. దీంతో అతనికి కేవలం రూ.4 కోట్లే దక్కనున్నాయి. ఇక మిగిలిన వాళ్ల విషయానికి వస్తే..
రుతురాజ్ గైక్వాడ్: రూ.18 కోట్లు
మతీషా పతిరానా: రూ.13 కోట్లు
శివమ్ దూబే: రూ.12 కోట్లు
రవీంద్ర జడేజా: రూ.18 కోట్లు
ఎంఎస్ ధోనీ: రూ.4 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.55 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ముగ్గురినే రిటెయిన్ చేసుకుంది. అత్యధికంగా విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించనుంది. మ్యాక్స్‌వెల్, డుప్లెస్సిలాంటి వాళ్లను వదులుకుంది.
విరాట్ కోహ్లీ: రూ.21కోట్లు
రజత్ పటీదార్: రూ.11 కోట్లు
యశ్ దయాల్: రూ.5 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.83 కోట్లు
రైటు మ్యాచ్ కార్డు కింద ఈ టీమ్ ఇద్దరు ప్లేయర్స్ ను తిరిగి వేలంలో పొందే అవకాశం ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ ను రిటెయిన్ చేసుకోకపోవడం గమనార్హం. దీంతో అతడు వేలంలోకి వెళ్లనున్నాడు.
అక్షర్ పటేల్: రూ.16.5 కోట్లు
కుల్దీప్ యాదవ్: రూ.13.25 కోట్లు
ట్రిస్టన్ స్టబ్స్: రూ.10 కోట్లు
అభిషేక్ పోరెల్: రూ.4 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.76.25 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్
అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరుగురు ప్లేయర్స్ నూ రిటెయిన్ చేసుకుంది. దీంతో వాళ్లకు వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డు కింద ఒక్క ప్లేయర్ ను కూడా మళ్లీ తీసుకునే అవకాశం లేదు. ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కూడా వదిలేయడం గమనార్హం.
రింకు సింగ్: రూ.13 కోట్లు
వరుణ్ చక్రవర్తి: రూ.12 కోట్లు
సునీల్ నరైన్: రూ.12 కోట్లు
ఆండ్రీ రసెల్ : రూ.12 కోట్లు
హర్షిత్ రాణా: రూ.4 కోట్లు
రమణ్‌దీప్ సింగ్: రూ.4 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.51 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్
ఊహించినట్లే లక్నో సూపర్ జెయింట్స్ కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసింది. ఆ టీమ్ మొత్తం ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. వాళ్లలో నికొలస్ పూర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మోహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీ ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటన్స్ ఐదుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. వాళ్లలో రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్ ఉన్నారు. ఒకే విదేశీ ప్లేయర్ ను మాత్రమే ఆ ఫ్రాంఛైజీ కొనసాగించింది.
పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్స్ నే రిటెయిన్ చేసుకుంది. వీళ్లలో గతేడాది రాణించిన శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఉన్నారు. దీంతో ఆ ఫ్రాంఛైజీ దగ్గర వేలం కోసం భారీ మొత్తం మిగిలే ఉంది.
రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ కూడా మొత్తం ఆరుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. దీంతో వాళ్లకు వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డు లేకుండా పోయింది. ఐపీఎల్ తొలి ఛాంపియన్స్ అయిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తోపాటు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మైర్, సందీప్ శర్మలను రిటెయిన్ చేసుకుంది.