IPL 2024 Purple Cap: ఐపీఎల్ 2024లో పేసర్ల జోరు: పర్పుల్ క్యాప్ రేసులో టాప్-10లో 9 మంది ఫాస్ట్ బౌలర్లు: టాప్‍లో స్పిన్నర్-ipl 2024 purple cap standings 9 pacers in top 10 yuzvendra chahal on first place after 29 matches ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Purple Cap: ఐపీఎల్ 2024లో పేసర్ల జోరు: పర్పుల్ క్యాప్ రేసులో టాప్-10లో 9 మంది ఫాస్ట్ బౌలర్లు: టాప్‍లో స్పిన్నర్

IPL 2024 Purple Cap: ఐపీఎల్ 2024లో పేసర్ల జోరు: పర్పుల్ క్యాప్ రేసులో టాప్-10లో 9 మంది ఫాస్ట్ బౌలర్లు: టాప్‍లో స్పిన్నర్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 15, 2024 03:59 PM IST

IPL 2024 Purple Cap Standings: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు పేసర్ల జోరు సాగుతోంది. పర్పుల్ క్యాప్ టాప్-10లో ప్రస్తుతం తొమ్మిది మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే, టాప్‍లో మాత్రమే స్పిన్నర్ ఉన్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసు ఎలా ఉందంటే..

IPL 2024 Purple Cap: ఐపీఎల్ 2024లో పేసర్ల జోరు: పర్పుల్ క్యాప్ రేసులో టాప్-10లో 9 మంది ఫాస్ట్ బౌలర్లు.. ఒక్కడే స్పిన్నర్
IPL 2024 Purple Cap: ఐపీఎల్ 2024లో పేసర్ల జోరు: పర్పుల్ క్యాప్ రేసులో టాప్-10లో 9 మంది ఫాస్ట్ బౌలర్లు.. ఒక్కడే స్పిన్నర్ (AP)

IPL 2024 Purple Cap: ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ 17వ సీజన్‍లో కొన్ని ఉత్కంఠ మ్యాచ్‍లు ఊపేశాయి. ఆదివారం (ఏప్రిల్ 14) చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా థ్రిల్లింగ్‍గా సాగింది. ఈ మ్యాచ్‍లో చెన్నై 20 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‍లో ఇప్పటి వరకు పేసర్లు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎక్కువ వికెట్లు తీసుకుంటున్నారు. అత్యధిక వికెట్లు తీసుకునే బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్ రేసులో ప్రస్తుతం టాప్-10లో 9 మంది పేసర్లే ఉన్నారు. అయితే, టాప్-1లో ఉన్న స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వద్దే పర్పుల్ క్యాప్ ఉంది. అయితే, ఆ తర్వాత 9 స్థానాల్లో మాత్రం ఫాస్ట్ బౌలర్లే ఉన్నారు. ఈ సీజన్‍లో 29 మ్యాచ్‍లు ముగిసే సరికి ఎక్కువ వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే.

ప్రస్తుతం పర్పుల్ క్యాప్ టాప్-10 రేసు ఇలా..

యుజవేంద్ర చాహల్: రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‍ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ చాహల్ వద్దే ఉంది.

జస్‍ప్రీత్ బుమ్రా: ముంబై ఇండియన్స్ పేసర్, బారత స్టార్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‍ల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో ప్రస్తుతం రెండో ప్లేస్‍లో ఉన్నాడు.

ముస్తాఫిజుర్ రహమాన్: చెన్నై సూపర్ కింగ్స్ లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‍ల్లో 10 వికెట్లు దక్కించుకున్నాడు. బుమ్రా కంటే కాస్త ఎకానమీ రేటు ఎక్కువగా ఉండటంతో అతడు ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు.

కగిసో రబాడా: పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ కగిసో రబాడా ఈ ఐపీఎల్ సీజన్‍లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‍ల్లో 9 వికెట్లను దక్కించుకున్నాడు.

ఖలీల్ అహ్మద్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేసర్ ఖలీల్ అహ్మద్ ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‍ల్లో 9 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో 5వ స్థానంలో నిలిచాడు.

అర్షదీప్ సింగ్: పంజాబ్ కింగ్స్ లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ ఆరు మ్యాచ్‍ల్లో 9 వికెట్లను తీసుకున్నాడు. ఖలీల్ కంటే ఎక్కువ ఎకానమీ రేటు ఉంటటంతో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు.

గెరాల్డ్ కోయిట్జీ: ముంబై ఇండియన్స్ పేసర్ గెలార్డ్ కోయిట్జీ ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‍లు ఆడి 9 వికెట్లను పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ పట్టికలో ప్రస్తుతం ఏడో ప్లేస్‍కు వచ్చాడు.

మతీష పతిరణ: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్, శ్రీలంక యంగ్ స్టార్ మతీశ పతిరణ ఈ సీజన్‍లో తాను ఆడిన 3 మ్యాచ్‍ల్లోనే 8 వికెట్లను దక్కించుకున్నాడు. ముంబైతో మ్యాచ్‍లోనే నాలుగు కీలక వికెట్లు పడకొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో 8వ స్థానంలో ఉన్నాడు పతిరణ.

సామ్ కరన్: పంజాబ్ కింగ్స్ పేసర్ సామ్ కరన్ కూడా 6 మ్యాచ్‍ల్లో 8 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం 9వ ప్లేస్‍లో నిలిచాడు.

మోహిత్ శర్మ: గుజరాత్ టైటాన్స్ సీనియర్ పేసర్ మోహిత్ శర్మ ఈ ఐపీఎల్ 2024 సీజన్‍‍లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‍ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‍లో పర్పుల్ క్యాప్ పట్టికలో ప్రస్తుతం పదో స్థానంలో ఉన్నాడు.

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు అత్యధికంగా 11 వికెట్లు తీసిన రాజస్థాన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వద్ద పర్పుల్ క్యాప్ ఉంది. అయితే, పర్పుల్ క్యాప్ పట్టిక టాప్-10లో ప్రస్తుతం ఆ తర్వాతి 9 స్థానాల్లోనూ ఫాస్ట్ బౌలర్లే ఉన్నారు. అంటే, ఈ సీజన్‍లో స్పిన్నర్లతో పోలిస్తే పేసర్ల హవానే ఇప్పటి వరకు సాగుతోంది. మరి తదుపరి మ్యాచ్‍ల్లో ఎలా ఉంటుందో చూడాలి.

ఆరెంజ్ క్యాప్

ఐపీఎల్ 2024 సీజన్‍లో అత్యధిక పరుగుల ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (319 పరుగులు) టాప్‍లో ఉన్నాడు. అతడే వద్దే ఆరెంజ్ క్యాప్ ఉంది. రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్ (284), రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (264), ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ (261), శుభ్‍మన్ గిల్ (255) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 15) సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది.

Whats_app_banner