IPL 2024 Opening Ceremony Live Streaming: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పర్ఫామ్ చేయబోయేది వీళ్లే-ipl 2024 opening ceremony live streaming details ar rahman sonu nigam akshay kumar jio cinema to stream it live ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Opening Ceremony Live Streaming: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పర్ఫామ్ చేయబోయేది వీళ్లే

IPL 2024 Opening Ceremony Live Streaming: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పర్ఫామ్ చేయబోయేది వీళ్లే

Hari Prasad S HT Telugu
Mar 20, 2024 12:58 PM IST

IPL 2024 Opening Ceremony Live Streaming: ఐపీఎల్ 2024కు టైమ్ దగ్గర పడింది. శుక్రవారం (మార్చి 22) నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్ ఓపెనింగ్ సెర్మనీ ఎప్పుడు, ఎక్కడ లైవ్ చూడాలి? ఇందులో పర్ఫామ్ చేయబోయేది ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పర్ఫామ్ చేయబోయేది వీళ్లే
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పర్ఫామ్ చేయబోయేది వీళ్లే

IPL 2024 Opening Ceremony Live Streaming: ఐపీఎల్ 17వ సీజన్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లోనే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే అంతకుముందు కళ్లు చెదిరే ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.

ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ

ఐపీఎల్ 2024 గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ సెర్మనీ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. సీజన్ తొలి మ్యాచ్ సీఎస్కే, ఆర్సీబీ మధ్య అక్కడే జరగనుడంతో ఓపెనింగ్ సెర్మనీ కూడా చెన్నైలోనే ఏర్పాటు చేశారు. ఇక ఈ ఓపెనింగ్ సెర్మనీ కోసం బాలీవుడ్ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తోపాటు సింగర్ సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి వాళ్లు ఈ ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఓపెనింగ్ సెర్మనీని జియో సినిమాలో చూడొచ్చు. ఈ సెర్మనీలో సోనూ నిగమ్ ఓ దేశభక్తి యాక్ట్ ను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ షో ఉండనుంది. మూడు దశాబ్దాలకుగాపై రెహమాన్ ఇండియన్ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూనే ఉన్నాడు. ఆస్కార్ కూడా గెలిచాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫార్మెన్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ నెక్ట్స్ మూవీ బడే మియా చోటే మియా ప్రమోషన్లతోపాటు పర్ఫామ్ చేయనున్నారు. సుమారు అరగంట పాటు ఈ ఓపెనింగ్ సెర్మనీ ఉండనుంది.

ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎక్కడ చూడాలి?

ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు. గతేడాది కూడా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రీగా ఐపీఎల్ చూసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. శుక్రవారం (మార్చి 22) సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.

ఆ తర్వాత ఏడు గంటలకు తొలి మ్యాచ్ టాస్ పడుతుంది. సీఎస్కే, ఆర్సీబీ ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆర్సీబీ టీమ్ చెన్నై చేరుకుంది. చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చిన ఈ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. చెన్నై వెళ్లే ముందు ఫ్యాన్స్ తో మాట్లాడాడు. ఈసారి ట్రోఫీ గెలవడానికి గట్టిగానే ప్రయత్నిస్తామని చెప్పాడు.

ఇప్పటికే ఆర్సీబీ మహిళల టీమ్ డబ్ల్యూపీఎల్ 2024 ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆర్సీబీ పురుషుల జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. 16 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నా రెండుసార్లు ఫైనల్ చేరడం తప్ప ట్రోఫీ గెలవలేదు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ తోనే తొలి మ్యాచ్ కావడంతో ఆర్సీబీకి అంత సులువైన పనిలా కనిపించడం లేదు.