ఆర్సీబీ లోగో, పేరులో మార్పు.. కొత్త జెర్సీ

Photo: RCB/X

By Chatakonda Krishna Prakash
Mar 19, 2024

Hindustan Times
Telugu

ఐపీఎల్ 2024 సీజన్‍కు ముందు అన్‍బాక్స్ ఈవెంట్‍ను నేడు (మార్చి 19) నిర్వహించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు. చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది.

Photo: X

ఐపీఎల్ 2024 కోసం ఆర్సీబీ లోగోలో మార్పులు చేసింది ఫ్రాంచైజీ. అలాగే, జట్టు పేరులో ‘Bangalore’ను ‘Bengaluru’కు మార్చింది. 

Photo: X

ఆర్సీబీ జట్టు కొత్త జెర్సీని కూడా ఫ్రాంచైజీ ఆవిష్కరించింది. బ్లూ, రెడ్ షెడ్‍లో ఈ జెర్సీ ఉంది. 

Photo: X

ఐపీఎల్‍లో 16 సీజన్లుగా టైటిల్ దక్కించుకోలేకపోయింది ఆర్సీబీ. అయితే, తాను ఎప్పటికీ ఆర్సీబీతోనే ఉంటానని ఈ ఈవెంట్‍లో మరోసారి స్పష్టం చేశాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. 

Photo: X

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన షురూ కానుంది. ఆరోజున తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. 

Photo: X

డబ్ల్యూపీఎల్ 2024లో ఛాంపియన్‍గా నిలిచి గెలిచి ఫ్రాంచైజీకి తొలి టైటిల్ సాధించిన ఆర్సీబీ మహిళల జట్టు కూడా ఈ ఈవెంట్‍కు హాజరైంది. ట్రోఫీతో అభివాదం చేశారు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన. 

Photo: X

బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యి హ‌నీరోజ్‌. 

twitter