DC vs CSK: మాకు హోం గ్రౌండ్‍లా ఉంది: వైజాగ్ స్టేడియంలో సపోర్ట్‌పై చెన్నై కెప్టెన్ రుతురాజ్.. ఢిల్లీ జట్టులోకి పృథ్వి-ipl 2024 csk vs dc a home game for us chennai super kings captain ruturaj gaikwad says on support of vizag crowd ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Csk: మాకు హోం గ్రౌండ్‍లా ఉంది: వైజాగ్ స్టేడియంలో సపోర్ట్‌పై చెన్నై కెప్టెన్ రుతురాజ్.. ఢిల్లీ జట్టులోకి పృథ్వి

DC vs CSK: మాకు హోం గ్రౌండ్‍లా ఉంది: వైజాగ్ స్టేడియంలో సపోర్ట్‌పై చెన్నై కెప్టెన్ రుతురాజ్.. ఢిల్లీ జట్టులోకి పృథ్వి

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 31, 2024 07:55 PM IST

DC vs CSK IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ విశాఖపట్నంలో షురూ అయింది. విశాఖలో తమ జట్టుకు లభిస్తున్న భారీ మద్దతుపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి పృథ్వి షా తిరిగి వచ్చేశాడు.

DC vs CSK: మాకు హోం గ్రౌండ్‍లా ఉంది: వైజాగ్ స్టేడియంలో సపోర్ట్‌పై చెన్నై కెప్టెన్ రుతురాజ్.. ఢిల్లీ జట్టులోకి పృథ్వి
DC vs CSK: మాకు హోం గ్రౌండ్‍లా ఉంది: వైజాగ్ స్టేడియంలో సపోర్ట్‌పై చెన్నై కెప్టెన్ రుతురాజ్.. ఢిల్లీ జట్టులోకి పృథ్వి

DC vs CSK: ఐపీఎల్ 2024 సీజన్‍లో విశాఖపట్నం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ షురూ అయింది. ఈ సీజన్‍లో ఆడిన రెండు మ్యాచ్‍ల్లో గెలిచిన చెన్నై.. రెండింట ఓడిన ఢిల్లీ ఈ పోరులో తలపడుతున్నాయి. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో నేడు (మార్చి 31) జరుగుతున్న ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. ఈ మ్యాచ్‍లో ఢిల్లీకి విశాఖ హోం గ్రౌండ్‍గా ఉన్నా.. స్టేడియమంతా చెన్నైకు మద్దతుగా పసుపుమయంగా మారింది.

ఎంఎస్ ధోనీ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వైజాగ్ స్టేడియంలో ప్రేక్షకులు భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. స్టేడియమంతా పసుపు జెర్సీలతో నిండిపోయింది. టాస్ సమయంలోనే ధోనీ.. ధోనీ అంటూ అరుపులతో ఫ్యాన్స్ హోరెత్తించారు.

వైజాగ్ స్టేడియంలో తమ జట్టుకు లభిస్తున్న మద్దతుపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తమ హోం గ్రౌండ్‍లో జరుగుతున్న మ్యాచ్‍లా అనిపిస్తోందని టాస్ సమయంలో గైక్వాడ్ అన్నాడు.

పృథ్వి వచ్చేశాడు

ఈ మ్యాచ్‍తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మళ్లీ వచ్చేశాడు స్టార్ యంగ్ ఓపెనర్ పృథ్వి షా. అయితే, స్వల్ప ఇబ్బంది వల్ల ఈ మ్యాచ్‍లో ఢిల్లీకి దూరమయ్యాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అలాగే, రికీ భుయ్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను తుది జట్టులోకి తీసుకుంది ఢిల్లీ.

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‍పాండే, మతీష పతిరణ, ముస్తాఫిజుర్ రహమాన్

చెన్నై సబ్‍స్టిట్యూట్ ఇంపాక్ట్ ఆప్షన్లు: శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, మొయిన్ అలీ, మిచెల్ సాంట్నర్

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు: పృథ్వి షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ సబ్‍స్టిట్యూట్ ఇంపాక్ట్ ఆప్షన్లు: సుమీత్ కుమార్, కుమార కుషాగ్ర, రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, జాక్ ఫ్రేసర్

హోరెత్తుతున్న వైజాగ్ స్టేడియం

ఫీల్డింగ్‍కు చెన్నై సూపర్ కింగ్స్ ఆడుగుపెట్టగానే వైజాగ్ స్టేడియంలోని ప్రేక్షకులు హోరెత్తించారు. ధోనీ మైదానంలోకి రాగానే.. మోతెక్కించారు. ధోనీ.. ధోనీ అంటూ అరుపులతో సందడి చేశారు. ఈ స్టేడియంలో ఎక్కువగా ప్రేక్షకులు చెన్నైకు మద్దతు తెలుపుతున్నారు. అయితే, రిషబ్ పంత్, సన్‍రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‍కు కూడా బాగానే సపోర్ట్ ఉంది. అయితే, ఈ మ్యాచ్‍లో ఢిల్లీకి ఇది హోం గ్రౌండ్ అయినా.. మొత్తంగా చెన్నైకే ఎక్కువ మద్దతు లభిస్తోంది. స్టాండ్స్‌లో ఎక్కువ మంది చెన్నై జెర్సీలు ధరించడంతో ఎల్లోమయం అయింది.

Whats_app_banner