India vs Zimbabwe 1st T20: జింబాబ్వేతో తొలి టీ20లో టీమిండియా ఓపెనర్లు వీళ్లే.. టీమ్ కన్ఫమ్ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్-india vs zimbabwe 1st t20 shubman gill abhishek sharma to open ruturaj gaikwad at number 3 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Zimbabwe 1st T20: జింబాబ్వేతో తొలి టీ20లో టీమిండియా ఓపెనర్లు వీళ్లే.. టీమ్ కన్ఫమ్ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

India vs Zimbabwe 1st T20: జింబాబ్వేతో తొలి టీ20లో టీమిండియా ఓపెనర్లు వీళ్లే.. టీమ్ కన్ఫమ్ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

Hari Prasad S HT Telugu
Jul 05, 2024 09:48 PM IST

India vs Zimbabwe 1st T20: జింబాబ్వేతో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా తరఫున ఓపెనింగ్ చేసేది ఎవరో చెప్పేశాడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్. ఈ మ్యాచ్ శనివారం (జులై 6) జరగనున్న విషయం తెలిసిందే.

జింబాబ్వేతో తొలి టీ20లో టీమిండియా ఓపెనర్లు వీళ్లే.. టీమ్ కన్ఫమ్ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
జింబాబ్వేతో తొలి టీ20లో టీమిండియా ఓపెనర్లు వీళ్లే.. టీమ్ కన్ఫమ్ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (PTI)

India vs Zimbabwe 1st T20: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ టీమిండియా ఈ మెగా టోర్నీ తర్వాత తమ తొలి సిరీస్ కు సిద్దమైంది. అయితే జింబాబ్వేతో జరగబోయే ఈ సిరీస్ కు సీనియర్లు ఎవరూ లేకపోవడంతో జూనియర్ టీమ్ వెళ్లింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోంది. శనివారం (జులై 6) జరగనున్న తొలి టీ20లో ఇండియన్ టీమ్ తరఫున ఓపెనింగ్ చేసేది ఎవరో కెప్టెన్ గిల్ వెల్లడించాడు.

టీమిండియా ఓపెనర్లు వీళ్లే..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలాంటి స్టార్లు రిటైరైన తర్వాత టీమిండియా తొలి టీ20 సిరీస్ ఆడబోతోంది. జింబాబ్వేతో శనివారం తొలి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న ఇండియా తరఫున తొలి మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. రుతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో రానున్నాడు.

టీ20 వరల్డ్ కప్ మొత్తం ఇండియా ఓపెనర్లు రోహిత్, కోహ్లి కనిపించగా.. ఇప్పుడా ఇద్దరూ ఈ ఫార్మాట్ నుంచి రిటైరయ్యారు. దీంతో మొత్తం కొత్త లుక్ లోని ఇండియన్ టీమ్ జింబాబ్వేతో తలపడబోతోంది. తొలి మ్యాచ్ కు ముందు శుక్రవారం (జులై 5) కెప్టెన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. తనతోపాతు అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయబోతున్నాడని కన్ఫమ్ చేశాడు.

ఐపీఎల్ స్టార్లకు అవకాశం

ఇప్పుడు ఓపెనింగ్ చేయబోతున్న అభిషేక్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున చెలరేగిపోయాడు. అతడు 16 మ్యాచ్ లలో ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్ తో 484 రన్స్ చేశాడు. అతనితోపాటు రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ లాంటి వాళ్లు కూడా టీ20ల్లో ఇండియా తరఫున అరంగేట్రం చేయనున్నారు. పరాగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్లో 15 మ్యాచ్ లలో 149 స్ట్రైక్ రేట్ తో 573 రన్స్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న కేవలం ఐదుగురు ప్లేయర్స్ రింకు సింగ్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్, ఖలీల్ అహ్మద్, సంజూ శాంసన్ మాత్రమే జింబాబ్వే పర్యటనలో ఉన్నారు. వీళ్లలోనూ దూబె, జైస్వాల్, సంజూ ఇంకా జింబాబ్వే వెళ్లలేదు. దీంతో తొలి రెండు టీ20లకు వీళ్లు అందుబాటులో ఉండరు. వీళ్ల స్థానంలో జితేష్ శర్మ, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్ ఉంటారు. మూడో టీ20 నుంచి వాళ్లు తిరిగి వస్తారు.

అటు శుభ్‌మన్ గిల్ కూడా తొలిసారి టీమిండియా కెప్టెన్ గా బరిలోకి దిగనున్నాడు. ఈ మధ్యే ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న అతనికి ఈ సిరీస్ మంచి అవకాశం. ఐపీఎల్లో కెప్టెన్ గా అతడు పెద్దగా రాణించలేదు. ఆ టీమ్ కనీసం ప్లేఆఫ్స్ చేరలేదు.ఇప్పుడు టీమిండియా కెప్టెన్సీ అతనికి సవాలే. జింబాబ్వేతో జులై 6 నుంచి 14 వరకు ఐదు టీ20లు ఆడనుంది. మరి ఈ యంగిండియా ఛాంపియన్స్ హోదాలో తొలి సిరీసే గెలుస్తుందేమో చూడాలి.

Whats_app_banner