IND vs SA T20 Series Schedule: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్.. టీమ్స్, మ్యాచ్ టైమింగ్స్ వివరాలివే
India vs South Africa Schedule 2024: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ జట్టు నాలుగు టీ20ల సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ జట్టుని ప్రకటించగా.. దక్షిణాఫ్రికా టీమ్‌ను కూడా అనౌన్స్ చేసేశారు. మ్యాచ్ షెడ్యూల్స్, టైమింగ్స్ వివరాలివే.
దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు నాలుగు టీ20ల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం వరకు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్ టెస్టు జట్టు.. నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఆ దేశానికి వెళ్తోంది. దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత్ టీ20 జట్టు.. దక్షిణాఫ్రికా గడ్డపైకి వెళ్లి నవంబరు 8 (శుక్రవారం) నుంచి టీ20 సిరీస్ ఆడనుంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 8 నుంచి 15 వరకు ఈ నాలుగు టీ20ల సిరీస్ జరగనుండగా..అన్ని మ్యాచ్‌లూ భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. టాస్ రాత్రి 9 గంటలకి పడనుంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా
- డర్బన్ వేదికగా నవంబరు 8న తొలి టీ20 మ్యాచ్
- నవంబరు 10న గెకెబర్హా వేదికగా రెండో టీ20 మ్యాచ్
- సెంచూరియన్ వేదికగా నవంబరు 13న మూడో టీ20 మ్యాచ్
- నవంబరు 15న జొహనెస్‌బర్గ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపికైన భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్
భారత్‌తో టీ20లో సిరీస్‌లో తలపడే దక్షిణాఫ్రికా టీమ్
ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్టెనిల్ బార్ట్మన్, గెరాల్డ్ కోట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిల్ సిమెమెలన్, ట్రిస్టన్ స్టబ్స్, లుథే సిపామ్లా (చివరి టీ20లకి మాత్రమే)
టీ20 సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ను టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానళ్లలో వీక్షించవచ్చు. ఆన్‌లైన్‌లో చూడాలనుకుంటే జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు
బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత్ టీ20 జట్టు.. ఇప్పుడు మంచి జోరుమీదుంది. అయితే.. దక్షిణాఫ్రికా జట్టుని దాని సొంతగడ్డపై ఓడించడం అంత సులువు కాదు. అయితే.. కొత్త ప్లేయర్లు ఎక్కువగా దక్షిణాఫ్రికా టీమ్‌లోకి రావడం భారత్ జట్టుకి కలిసొచ్చే అంశం.