IND vs NZ Schedule: భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌ షెడ్యూల్, టైమింగ్స్, టీమ్స్ వివరాలివే-india vs new zealand test series full schedule and squads where to watch live streaming ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz Schedule: భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌ షెడ్యూల్, టైమింగ్స్, టీమ్స్ వివరాలివే

IND vs NZ Schedule: భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌ షెడ్యూల్, టైమింగ్స్, టీమ్స్ వివరాలివే

Galeti Rajendra HT Telugu
Oct 15, 2024 01:23 PM IST

India vs New Zealand 1st Test: భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టుకి బెంగళూరు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (PTI)

భారత్, న్యూజిలాండ్ మధ్య ఆసక్తికరమైన టెస్టు సిరీస్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. మూడు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు ఇటీవల భారత్ గడ్డపైకి వచ్చిన న్యూజిలాండ్ టీమ్.. బుధవారం (అక్టోబరు 16) నుంచి భారత్‌తో తలపడబోతోంది.

జోరుమీదున్న టీమిండియా

భారత్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో అద్భుతమైన విజయాల్ని అందుకుని మంచి జోరుమీదుంది. దాదాపు రెండు వారాలు భారత టెస్టు టీమ్‌కి రెస్ట్ కూడా దొరికింది. అన్నింటికీ మించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నెం.1 స్థానాన్ని భారత్ మరింత పదిలం చేసుకుంది.

ఒత్తిడిలో న్యూజిలాండ్ టీమ్

న్యూజిలాండ్ టీమ్ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. వరుసగా ఆస్ట్రేలియా, శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్‌ను ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో భారత్ గడ్డపై ఆ జట్టు అడుగుపెట్టింది. తన కంటే బలహీనంగా ఉన్న శ్రీలంక చేతిలో ఇటీవల రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్

  • అక్టోబరు 16 నుంచి 20 వరకు బెంగళూరు వేదికగా తొలి టెస్టు మ్యాచ్
  • అక్టోబరు 24 నుంచి 28 వరకు పుణె వేదికగా రెండో టెస్టు మ్యాచ్
  • నవంబరు 1 నుంచి 5 వరకు ముంబయి వేదికగా మూడో టెస్టు మ్యాచ్

మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

మూడు టెస్టు మ్యాచ్‌లూ ఉదయం 9.30 గంటలకి ప్రారంభంకానున్నాయి. అయితే.. మ్యాచ్ తొలి రోజు మాత్రం టాస్ ఉదయం 9 గంటలకే పడనుంది. ఇక మ్యాచ్‌లను లైవ్‌లో స్పోర్ట్స్ 18 ఛానల్‌లో చూడవచ్చు. ఆన్‌లైన్‌లో చూడాలనుకుంటే జియో సినిమాలో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.

భారత్ టెస్టు జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌, శుభ‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్), రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మమ్మద్ సిరాజ్‌, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ఆకాశ్‌ దీప్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌).

న్యూజిలాండ్ టెస్టు టీమ్

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, డార్లీ మిచెల్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్ వెల్ (మొదటి టెస్టుకి మాత్రమే), మార్క్ చాప్మన్, దేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇస్ సోధి (రెండు, మూడో టెస్టుకి మాత్రమే), టిమ్ సౌథీ, విల్ యంగ్, కేన్ విలియమ్సన్ (మొదటి టెస్టుకి అందుబాటులో లేడు)

Whats_app_banner