తెలుగు న్యూస్ / ఫోటో /
Ind vs NZ 1st Test: ఇండియాను ఓడించడం మాకు అసాధ్యమే: న్యూజిలాండ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Ind vs NZ 1st Test: బంగ్లాదేశ్ టెస్ట్, టీ20 సిరీస్ లలో క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్ ను వాళ్ల స్వదేశంలో ఓడించడం కష్టమే అని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.
- Ind vs NZ 1st Test: బంగ్లాదేశ్ టెస్ట్, టీ20 సిరీస్ లలో క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్ ను వాళ్ల స్వదేశంలో ఓడించడం కష్టమే అని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.
(1 / 5)
Ind vs NZ 1st Test: టీమిండియా స్వదేశంలో మరో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. గత 12 ఏళ్లుగా వరుసగా 18 సిరీస్ లు గెలిచిన ఇండియన్ టీమ్.. ఇప్పుడు న్యూజిలాండ్ తోనూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. బుధవారం (అక్టోబర్ 16) నుంచి బెంగళూరులో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ ఈ సిరీస్ పై మాట్లాడాడు.(AP)
(2 / 5)
Ind vs NZ 1st Test: ఇండియన్ టీమ్ బంగ్లాదేశ్ పై టెస్ట్, టీ20 సిరీస్ లు క్లీన్ స్వీప్ చేసిన ఆత్మవిశ్వాసంతో దిగుతుంటే.. న్యూజిలాండ్ మాత్రం శ్రీలంక చేతుల్లో దారుణమైన ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఇండియాకు వచ్చింది. ముఖ్యంగా లంక స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఇండియన్ టీమ్ స్టార్ స్పిన్నర్లను చూసి ఆ టీమ్ బ్యాటర్లు మరింత వణుకుతున్నారు.(AFP)
(3 / 5)
Ind vs NZ 1st Test: న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ఇండియాతో టెస్టు సిరీస్ పై స్పందించాడు. ఇప్పుడు టీమిండియా క్రికెట్ ఆడుతున్న తీరు చూస్తుంటే.. వాళ్ల స్వదేశంలో వారిని ఓడించడం కష్టమే అని స్టెడ్ అన్నాడు. ఇదో పెద్ద సవాలని, ఇండియన్ టీమ్ లో చాలా మంది సీనియర్లు ఉన్నారని స్టెడ్ అభిప్రాయపడ్డాడు.(REUTERS)
(4 / 5)
Ind vs NZ 1st Test: శ్రీలంకతో సిరీస్ లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్సీ నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో టామ్ లేథమ్ కు కెప్టెన్సీ ఇచ్చారు. అతనికి ఇండియా సిరీస్ అగ్ని పరీక్ష కానుంది.(AFP)
ఇతర గ్యాలరీలు