IND vs NZ 1st Test Toss Updates: భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు టాస్ ఆలస్యం, టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డులిలా!
India vs New Zealand 1st test Live: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బుధవారం ఉదయం 9 గంటలకి ప్రారంభంకావాల్సిన టెస్టు మ్యాచ్ ఆలస్యం అవుతోంది. భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు స్టేడియంలో నిరీక్షిస్తున్నారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బుధవారం (అక్టోబరు 16) ప్రారంభంకావాల్సిన తొలి టెస్టు మ్యాచ్ ఆలస్యం అవుతోంది. ఉదయం నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. దాంతో స్టేడియానికి చేరుకున్న భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు, ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ టాస్ ఉదయం 9 గంటలకి పడాల్సి ఉంది. కానీ.. ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. ఒకవేళ వర్షం తగ్గిపోతే చిన్నస్వామి స్టేడియంలో ఉన్న అధునాతన డ్రైనేజ్ సిస్టమ్ సాయంతో కేవలం 40-55 నిమిషాల్లోనే మ్యాచ్‌కి అనువుగా మైదానాన్ని సిద్ధం చేయగలమని క్యూరేటర్ చెప్తున్నాడు.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొత్తం మూడు టెస్టుల సిరీస్ జరగనుండగా.. తొలి టెస్టుకి బెంగళూరు, రెండో టెస్టు మ్యాచ్‌కి అక్టోబరు 24 నుంచి పుణె, నవంబరు 1 నుంచి మూడో టెస్టుకి ముంబయి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.
భారత్ గడ్డపై న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు 12 టెస్టు సిరీస్‌ల్లో భారత్‌ను ఢీకొనగా.. ఇందులో ఏకంగా 10 సిరీస్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. మిగిలిన రెండు సిరీస్‌లు కూడా డ్రాగా ముగిశాయి. ఈ క్రమంలో మొత్తం 36 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచింది. రెండింటిలో మాత్రం కివీస్ విజయం సాధించింది. ఇక మిగిలిన 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
భారత్ టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మమ్మద్ సిరాజ్, , ఆకాశ్ దీప్, సర్ఫరాజ్ ఖాన్ .
న్యూజిలాండ్ టెస్టు టీమ్
టామ్ లాథమ్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, డార్లీ మిచెల్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్ వెల్ (మొదటి టెస్టుకి మాత్రమే), కేన్ విలియమ్సన్ (మొదటి టెస్టుకి అందుబాటులో లేడు), మార్క్ చాప్మన్, దేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇస్ సోధి (రెండు, మూడో టెస్టుకి మాత్రమే), టిమ్ సౌథీ, విల్ యంగ్,