IND vs ENG: ఇంగ్లండ్‍తో టీమిండియా వామప్ మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్
World Cup Warm-up match India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రపంచకప్ వామప్ మ్యాచ్ మొదలైంది. ముందుగా టాస్ గెలిచింది టీమిండియా.
World Cup Warm-up match India vs England: వన్డే ప్రపంచకప్ సన్నాహాన్ని టీమిండియా షురూ చేసింది. భారత్ వేదికగా అక్టోబర్ 5న వరల్డ్ కప్ మొదలుకానుండగా... అంతకు ముందు సన్నాహకంగా ప్రస్తుతం వామప్ మ్యాచ్‍లు జరుగుతున్నాయి. నేడు (సెప్టెంబర్ 30) గువహటి వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య వామప్ మ్యాచ్ మొదలైంది. ఈ సన్నాహక పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. జట్టులోని అందరూ ప్రస్తుతం ఫిట్‍గా ఉన్నారని రోహిత్ శర్మ చెప్పాడు.
బౌలర్లు ఫ్రెష్‍గా ఉండి.. అండర్ లైట్స్ బౌలింగ్ చేయాలన్న కారణంతోనే ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నట్టు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. “మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. అందుకే మా బౌలర్లు ఫ్రెష్‍గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. లైట్స్ కింద బౌలింగ్ చేస్తే బౌలర్లు పెద్దగా అలసిపోరు. ఎందుకంటే మేం ఇటీవల చాలా మ్యాచ్‍లు ఆడాం. అందుకే బౌలర్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. అక్టోబర్ 8వ తేదీకి మా ఆటగాళ్లు ఫ్రెష్‍గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మేం ఒకానొక టాప్ టీమ్‍తో ఈ మ్యాచ్ ఆడుతున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరూ ఫిట్‍గా ఉన్నారు” అని టాస్ సమయంలో రోహిత్ చెప్పాడు.
తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారని, ఆ అనుభవం ఈ ప్రపంచకప్‍లో బాగా కలిసి వస్తుందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెప్పాడు. కాగా, టాస్ పడినా వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం కలిగింది.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ
ఇంగ్లండ్ జట్టు: డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‍స్టోన్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కరన్, డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్‍సన్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్