IND vs ENG 4th Test Toss: టాస్ ఓడిన భారత్ - ఇంగ్లండ్ ఫస్ట్ బ్యాటింగ్ - పేసర్ అక్షదీప్ అరంగేట్రం
IND vs ENG 4th Test Toss: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (నేటి) నాలుగో టెస్ట్ మొదలైంది. రాంచీ వేదికగా జరుగుతోన్న ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది
IND vs ENG 4th Test Toss: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (నేటి) నాలుగో టెస్ట్ మొదైలంది. రాంచీ వేదికగా జరుగుతోన్న ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది రెండు వరుస విజయాలతో టీమిండియా జోరు మీదున్నది. కోహ్లి, రాహుల్ లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్స్ లేకున్నా యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌ఖాన్, ధ్రువ్ జురేల్ వంటి యంగ్‌స్టర్స్ ఆ లోటు కనబడనీయకుండా ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. నాలుగో టెస్ట్‌లో తొలిరోజు నుంచి ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించాలనే ప్రణాళికలతో రోహిత్ సేన బరిలో దిగింది. నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఒక మార్పులో బరిలో దిగింది. బుమ్రా స్థానంలో అక్షదీప్‌సింగ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
బుమ్రా దూరం...
నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు స్టార్ పేసర్ బుమ్రా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా విజయంలో బుమ్రా కీలక భూమిక పోషించాడు. కష్టాల్లో ఉన్నప్రతిసారి టీమిండియాను గట్టెక్కించాడు బుమ్రా. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రానే టాప్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 17 వికెట్లు తీశాడు. బుమ్రా లేని లోటును టీమిండియా ఎంత వరకు భర్తీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్ పేస్ దళాన్ని సమర్థవంతంగా నడిపిస్తాడా లేదా చూడాల్సిందే. రాజ్‌కోట్‌లో సిరాజ్ చెలరేగడం టీమిండియాకు సానుకూలంగా మారింది. బుమ్రా స్థానంలో అక్షదీప్‌సింగ్ జట్టులోకి వచ్చాడు.
యశస్వి మరో డబుల్ కొడతాడా…
ఈ టెస్ట్ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలతో జోరుమీదున్నాడు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్. 545 రన్స్‌తో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. రాంచీ టెస్ట్‌లో అతడు చెలరేగితే ఇంగ్లండ్‌కు మళ్లీ కష్టాలు తప్పవు. రాజ్‌కోట్‌లో సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు ప్లస్ పాయింట్‌గా మారనుంది. అరంగేట్రం టెస్ట్‌లోనే రెండు హాఫ్ సెంచరీలతో సర్ఫరాజ్ సత్తా చాటాడు. గిల్‌తో పాటు రజత్ పాటిదార్ వైఫల్యాలు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాయి. తల్లి అనారోగ్యం కారణంగా మూడో టెస్ట్ నుంచి మధ్యలోనే వైదొలిగిన అశ్విన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు జడేజా, కుల్దీప్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
సీనియర్ల వైఫల్యం...
సీనియర్ల వైఫల్యం ఇంగ్లాండ్‌ను దెబ్బకొడుతోంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు రూట్, బెయిర్‌స్టో ఇప్పటివరకు తమ బ్యాట్‌కు పని చెప్పలేదు. డకెట్ అక్కడే కాస్తంత పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో ఇంగ్లండ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. ఇండియాను దెబ్బకొడతాడని భావించిన స్పిన్నర్ షోయబ్ బషీర్ పూర్తిగా తేలిపోతున్నారు. రాజ్‌కోట్ టెస్ట్‌లో సీనియర్ పేసర్ అండర్సన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ వరుసగా మూడు సిక్సులు కొట్టాడంటే ఇంగ్లండ్ బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారత జట్టు ఇదే...
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌గిల్, సర్ఫరాజ్‌ఖాన్, రజత్ పాటిదార్. అశ్విన్, జడేజా, కుల్దీప్, సిరాజ్, ధ్రువ్ జురేల్, అక్షదీప్
ఇంగ్లండ్ జట్టు ఇదే...
క్రాలీ, డకెట్, పోప్, స్టోక్స్, బెయిర్ స్టో, రూట్, ఫోక్స్, హార్ట్‌లీ, అండర్సన్, రాబిన్సన్, బషీర్