Pandya vs Kl Rahul: శ్రీలంక సీరిస్‌కు రోహిత్, కోహ్లి దూరం - టీమిండియా వన్డే కెప్టెన్సీ కోసం పాండ్యతో రాహుల్ పోటీ?
Pandya vs Kl Rahul: జూలై నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక సిరీస్‌కు టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా పాండ్యతో పాటు కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తోన్నాయి.
Pandya vs Kl Rahul: శ్రీలంక సిరీస్‌కు టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతోన్నారు రోహిత్, కోహ్లి, ఐపీఎల్ తో మూడు నెలలు బిజీగా ఉన్న టీమిండియా క్రికెటర్లు వెంటనే టీ20 వరల్డ్ కప్ ఆడారు.
జింబాబ్వే సిరీస్‌కు యంగ్ టీమ్...
వరల్డ్ కప్ తర్వాత ప్రస్తుతం టీమిండియా...జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సీరిస్ కోసం భారత సీనియర్ ప్లేయర్లు అందరికి విశ్రాంతి నిచ్చింది బీసీసీఐ. కోహ్లి, రోహిత్ మాత్రమే కాకుండా బుమ్రా, పాండ్య, సిరాజ్‌తో పాటు మిగిలిన ప్లేయర్లు దూరమయ్యారు.శుభ్‌మన్ గిల్ సారథ్యంలో యంగ్ టీమ్ జింబాబ్వే సిరీస్ ఆడుతోంది.
రోహిత్, కోహ్లి దూరం...
జింబాబ్వే సిరీస్ తర్వాత వన్డే, టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది భారత జట్టు. ఈ సీరిస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ బిజీ షెడ్యూల్స్ నుంచి మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనతో వీరిద్దరు శ్రీలంక టూర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐతో రోహిత్, కోహ్లి చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి మరో ఏడెనిమిది నెలల వరకు వన్డే జట్టులో కనిపించడం అనుమానంగానే కనిపిస్తోంది. శ్రీలంక సిరీస్ తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఆ సిరీస్ ద్వారా వన్డేల్లోకి కోహ్లి, రోహిత్ రీఎంట్రీ ఇస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతోన్నాయి. టెస్ట్‌లకు మాత్రం వారు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
పాండ్య వర్సెస్ కేఎల్ రాహుల్...
శ్రీలంక సిరీస్‌కు రోహిత్ దూరమైతే అతడి స్థానంలో ఎవరు టీమిండియా వన్డే సారథ్య బాధ్యతలను స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నా పాండ్యకు శ్రీలంక సిరీస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోన్నాయి.
11 వికెట్లు…144 రన్స్…
టీ20 వరల్డ్ కప్‌కు ముందు పేవలమైన ఫామ్‌తో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు పాండ్య. దాంతో టీ20 వరల్డ్ కప్‌లో అతడికి చోటు దక్కడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ విమర్శకుల అంచనాలకు తగక్రిందులు చేస్తూ బ్యాట్‌తోనే కాకుండా బాల్‌తో రాణించాడు. టీ20 వరల్డ్ కప్‌లో 11 వికెట్లతో పాటు 144 పరుగులు చేశాడు. ఫైనల్‌లో చివరి ఓవర్ అద్భుతంగా వేసి టీమిండియాకు కప్ అందించాడు.
పాండ్య ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని వన్డే కెప్టెన్సీ పగ్గాలను అతడికే అప్పగించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. కెప్టెన్సీ విషయంలో పాండ్యతో కేఎల్ రాహుల్ పోటీపడుతోన్నట్లు సమాచారం. వన్డేల్లో పాండ్యకు కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేదు. అతడికి కాకుండా కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమిస్తే బాగుంటుందని మరికొందరు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కెప్టెన్ ఎవరన్నది క్లారిటీ రానున్నట్లు సమాచారం.
జూలై 27 నుంచి ఆగస్టు ఏడు వరకు శ్రీలంక సిరీస్ జరుగనుంది.ఈ సిరీస్‌లో మూడు టీ20లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లతో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.