SL vs BAN T20 World Cup: థ్రిల్లర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విక్టరీ - వరల్డ్ కప్‌లో శ్రీలంకకు వరుసగా రెండో ఓటమి
SL vs BAN T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకకు రెండో ఓటమి ఎదురైంది. శనివారం చివరి వరకు థ్రిల్లింగ్‌గా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ రెండు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
SL vs BAN T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా, అప్ఘానిస్తాన్ వంటి చిన్న దేశాలు అద్భుత విజయాల్ని అందుకుంటుంటే...పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ లాంటి మేటి దేశాలు మాత్రం పరాజయాలతో కుదేలవుతోన్నాయి. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకకు బంగ్లాదేశ్ షాకిచ్చింది. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు అమెరికా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయి విమర్శలను ఎదుర్కొన్నది బంగ్లాదేశ్. ఈ ఓటమి నుంచి పుంజుకొని వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నది.
ఓపెనర్ నిస్సాంక మినహా...
ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ నిస్సాంక మినహా మిగిలిన శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఎదుర్కొంటూ నిస్సాంక ఒక్కడే బ్యాట్ ఝులిపించాడు. 28 బాల్స్‌లో ఏడు ఫోర్లు ఓ సిక్సర్‌తో 47 రన్స్ చేశాడు నిస్సాంక.
చేతులెత్తేసిన సీనియర్లు...
సీనియర్ బ్యాటర్లు కుషాల్ మెండిస్ (10 రన్స్), మాథ్యూస్ (16 పరుగులు), ధనుంజయ డిసిల్వా (21 రన్స్)తో నిరాశపరిచారు. కెప్టెన్ హసరంగా తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. చివరి ఆరు వికెట్లను బంగ్లాదేశ్ 24 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. 100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ నాలుగు ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. రిషాద్ హుస్సేన్ మూడు, టాస్కిన్ అహ్మద్ రెండు వికెట్లతో శ్రీలంకను దెబ్బకొట్టారు.
తుషార మెరుపులతో…
సింపుల్ టార్గెట్‌ను ఛేదించడంలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. శ్రీలంక పేసర్ నువాన్ తుషార విజృంభించడంలో ఆరు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. సౌమ్య సర్కార్ డకౌట్ కాగా...హసన్ మూడు రన్స్ చేశాడు. 28 రన్స్‌కు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను లిట్టన్ దాస్, తౌహిద్ హ్రిదోయ్ కలిసి గట్టెక్కించారు. హ్రిదోయ్ 20 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 40 రన్స్ చేశాడు. 38 బాల్స్‌లో 36 రన్స్‌తో హ్రిదోయ్‌కి లిట్టన్ దాస్ సహకారం అందించాడు.
గట్టెక్కించిన మహ్మదుల్లా...
వీరిద్దరు ఔటైన తర్వాత బంగ్లాదేశ్ ఓటమి దిశగా ప్రయాణించింది. మహ్మదుల్లా (16 రన్స్) బంగ్లాదేశ్‌కు విజయాన్ని అందించాడు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార నాలుగు, హసరంగ రెండు వికెట్లతో రాణించారు.
77 పరుగులకే ఆలౌట్...
ఈ వరల్డ్ కప్‌లో శ్రీలంకకు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది శ్రీలంక. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 77 పరుగులకే ఆలౌటైంది.
2014లో టీ20 వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచిన శ్రీలంక ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి చిన్నదేశాలను ఓడించలేక చతికిలా పడటం ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.